ప్రజలను ఆదుకుందాం రండి.. సెలబ్రిటీలకు సోనూసూద్‌ పిలుపు..

April 27, 2021 1:15 PM

గతేడాది కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నటుడు సోనూసూద్‌ ఎంత మందికి సహాయం చేశాడో అందరికీ తెలిసిందే. సోనూసూద్‌ అలా చేయడం వల్ల రీల్‌ లైఫ్‌ కాదు, రియల్‌ లైఫ్‌ హీరో అయ్యాడు. అయితే ప్రస్తుతం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలోనూ సోనూ తన సహాయాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోనూసూద్‌ ప్రజలకు సహాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకు రావాలని కోరుతున్నాడు.

celebrities please come forward to help people sonu sood requests

ప్రస్తుతం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నడుస్తోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. మా దగ్గర 25-30 మంది టెక్నిషియన్లు ఉన్నారు. వారు రోజుకు 24 గంటలూ పనిచేస్తున్నారు. దేశంలో అవసరం ఉన్నవారికి సహాయం అందిస్తున్నారు. ఎవరైనా సహాయం కావాలని ఫోన్‌ చేస్తే వెంటనే మా టీమ్‌ స్పందిస్తోంది. వారికి కావల్సిన ప్లాస్మా, ఇంజెక్షన్లు, ఆక్సిజన్‌, ఇతర వైద్య సామగ్రితోపాటు అవసరం అయిన సహాయం చేస్తున్నాం.. అని సోనూసూద్‌ అన్నాడు.

ఇక దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని, ఎంతో మంది సహాయం కోసం చూస్తున్నారని, అలాంటి వారందరినీ ఆదుకునేందుకు కేవలం కొద్ది మంది సహాయం సరిపోదని, కనుక చాలా చాలా మంది సెలబ్రిటీలు, సామాజిక వేత్తలు, దాతలు ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని సోనూసూద్‌ కోరాడు. మరి సెలబ్రిటీలు సోనూ పిలుపుకు స్పందిస్తారో, లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment