దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురి చేస్తున్నాయి.రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రం కావడంతో ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో పాటు పడకల కొరత ఏర్పడటంతో ఎంతోమందికి సరైన సమయంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రైవేటు ఆసుపత్రిలో సైతం కరోనా రోగులను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి చేతులెత్తిస్తున్నాయి. కరోనా తీవ్రత వల్ల దేశంలో ఎంతటి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయో తెలిపేందుకే ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన రేణు సింఘాల్ భర్త రవి సింఘాల్ గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ బారిన పడ్డాడు.
కరోనాతో ఎంతో ఇబ్బందిపడుతున్న రవి ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం అతనిభార్య ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ఆస్పత్రికి వెళ్లే సమయంలో ఊపిరి పీల్చుకో లేక ఇబ్బంది పడుతున్న అతడికి ఆమె నోటితోనే శ్వాస అందించి తన భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రి చేరేలోగా అతడు ఆమె ఒడిలోనే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని కలిచి వేసింది.
మార్చి 4, 2026న హైదరాబాద్‌లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్‌లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…