Marriage : పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలుసా..? మూడు కారణాలున్నాయి..! మీరనుకున్నది అయితే కాదు..!

April 23, 2023 7:54 PM

Marriage : ఇద్దరు మనుషులను ఒకటిగా చేసే వేడుకే వివాహం. అప్పటివరకు వేరువేరుగా ఉన్న స్త్రీ పురుషులను దంపతులుగా కల‌పడమే వివాహలక్ష్యం. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు ఏ పరిచయం లేకపోయినా పెళ్లిచేసుకున్నాక వారి మధ్య ప్రేమ చిగురించేంతటి మహత్తు వివాహబంధానికి ఉంది. సహజీవనం, కాంట్రాక్ట్ మ్యారేజెస్ వచ్చి వివాహ బంధానికి బీటలు పడ్డాయని చెప్పొచ్చు. మారిన జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితంలో బంధాల కంటే ఎక్కువగా కెరీర్‌లో ఎదగడానికి ప్రిపేర్ చేయడం.. పెళ్లెందుకు.. అవసరమా అనే ఆలోచనా ధోరణిలో నేటి యువత ఉంది. పెళ్లెందుకు అనే ప్రశ్నకి సమాధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ప్రతీ మనిషీ మూడు రుణాలతో పుడతాడు.1. రుషి రుణం 2. దేవ రుణం 3.పితృ రుణం. ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ రుణాల‌ను తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు రుణ విముక్తుడు కావాలి. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెబుతున్నది. 1. రుషి రుణం – బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేసి బ్రహ్మచర్యం ద్వారా రుషి రుణం తీర్చాలి. పురాణాలను అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి.

why Marriage is necessary what are the reasons
Marriage

దేవ రుణం – నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికీ మనమెంతో రుణపడి వున్నాం. కనుక ఆ రుణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నులం అవుతాం. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాల వల్ల దేవతలు తృప్తి చెందుతారు. యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి. . దీనివలన సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి.

3. పితృ రుణం – తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితృ రుణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా. ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః అంటుంది వేదం. అంటే వంశ పరంపరను తెంచవద్దు. ఇలా ఈ 3 కార‌ణాల కోసం ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా వివాహం చేసుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment