Srisailam : శ్రీశైల క్షేత్రానికి ఏ నెలలో వెళితే ఎలాంటి ఫలితం కలుగుతుంది..?

June 28, 2023 9:39 PM

Srisailam : చాలామంది శ్రీశైల ఆలయానికి వెళుతుంటారు. శ్రీశైలం గురించి, శ్రీశైల మహిమ గురించి చెప్పే కొద్ది ఎన్నో విషయాలు చెబుతూనే ఉండాలి. దీని దివ్య శక్తి ఎంతో అమోఘం. భౌతిక ఇంద్రియాలతో చూడలేని దివ్యత్వం ఈ ఆలయంలో ఉంది. ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలన మాత్రమే ఈ ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ విషయం స్కాంద పురాణంలోని శ్రీశైల కాండలో ఉంది. అయితే ఈ క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకుంటే, ఎలాంటి భాగ్యం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

చైత్రమాసంలో శ్రీశైలం లో ఉండే ఈ మహిమగల ఆలయాన్ని దర్శించుకుంటే, సకల శుభాలు కలుగుతాయి. బహు యజ్ఞాలు ఆచరించిన ఫలితం కలుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. వైశాఖ మాసంలో ఈ ఆలయానికి వెళితే కష్టాలు తీరిపోతాయి. లక్ష గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది. జేష్ఠ మాసంలో ఇక్కడికి వెళితే లగోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలితం లభిస్తుంది. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడికి ఆషాడ మాసంలో వెళితే బంగారు రాశులని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. కోటి గోవుల్ని శివాలయానికి దానమిచ్చినంత పుణ్యం పొందుతారు.

which month Srisailam darshanam gives what benefits
Srisailam

శ్రావణ మాసంలో ఈ ఆలయానికి వెళితే యోజనం పొలమును పంటతో పాటు, పండితునికి దానం చేసినంత గొప్ప ఫలితం మీకు కలుగుతుంది. భాద్రపద మాసంలో ఈ ఆలయానికి వెళితే కోటి కపిల గోవులను పండితులకు దానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. ఆశ్వయుజ మాసంలో ఇక్కడికి వెళితే, వెయ్యి కన్యాదానాలు చేసినంత ఫలితం కలుగుతుంది. పాపాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక మాసంలో ఇక్కడికి వెళితే వాజపేయ యాగాలు చేసినంత ఫలితాన్ని పొందొచ్చు. యజ్ఞాలలో అన్నిటికంటే ఇది చాలా గొప్పది.

మార్గశిరమాసంలో ఇక్కడికి వెళితే పౌండరీక యాగం చేసినంత ఫలం మీకు కలుగుతుంది. పాపాలన్నీ కూడా పోతాయి. పుష్య మాసంలో వెళితే మోక్షం లభిస్తుంది. పాపాలన్నీ పోతాయి. మాఘమాసంలో ఇక్కడికి వెళితే శ్రేయస్సు కలుగుతుంది. రాజసూయ యాగం చేసినంత ఫలితం మీకు కలుగుతుంది. ఫాల్గుణ మాసంలో ఇక్కడికి వెళితే తరగని సంపదని పొందొచ్చు. సౌతామణి యాగఫలం కూడా మీకు కలుగుతుంది. ఎనలేని పుణ్యాన్ని కూడా మీరు సంపాదించుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment