కాసేపు మనం ఆలయానికి వెళ్లి అక్కడ కూర్చుంటే, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది ఆలయాలకి వీలు కుదిరినప్పుడల్లా వెళ్తూ వుంటారు. పండగ సమయంలో, జాతర వేళలో అయితే చాలామంది భక్తులు ఆలయాలకి వెళ్తుంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు, మనం దేవుని దర్శించుకోవడానికి ముందు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. గుడి చుట్టూ తిరుగుతూ మూడుసార్లు లేదంటే ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే, ప్రదక్షిణలు చేయడానికి వెళుతున్నప్పుడు, దేవాలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు.
కానీ, చాలామంది తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు. అయితే, ఎందుకు ఆలయ వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు..? దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలియక చాలామంది ఆలయానికి వెళ్ళినప్పుడు, కొన్ని పొరపాట్లు చేస్తారు. కానీ, ఖచ్చితంగా ఈ నియమాలని పాటించాలి. పొరపాట్లు చేయకుండా ఉంటే, దేవుని అనుగ్రహం కలుగుతుంది. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
ఏ పని మొదలుపెట్టిన విజయం సాధించాలని మనం కోరుకుంటాం. భగవంతుడి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ.. ఆలయంకి వెళ్లి దర్శనం అయిన తర్వాత మన వెన్ను దేవుడికి చూపించకుండా, తిరిగి అలానే వెనక్కి వచ్చేస్తూ ఉంటాము. దేవాలయాన్ని తాకుతూ ప్రదక్షిణలు చేయకూడదు. గుడిలోని వెనుక భాగంలో రాక్షసులు ఉంటారని అంటారు.
అలా చేయడం వలన రాక్షసులని నిద్రలేపినట్లు అవుతుందట. గుడికి వెళ్లి, దేవుడిని ఈ విధంగా మీరు ప్రార్థిస్తే, కచ్చితంగా నెగిటివ్ ప్రభావం మీ పై పడుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి, వెనుక వైపు తాకకండి. ప్రదక్షణ సమయంలో గుడిని తాకుతూ ప్రదక్షిణలు చేయొద్దు. అదే విధంగా మనం ఆలయానికి వెళ్ళాక, దర్శనమైన వెంటనే తిరిగి వచ్చేయకూడదు. ఒకసారి ఆలయంలో ఎక్కడైనా కూర్చుని, ఆ తర్వాత రావాలి. ఆలయానికి వెళ్ళిన తర్వాత తీర్థం తాగి, తీర్థం తీసుకున్న చెయ్యిని తలకి రాసుకోకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే, అంతా మంచే జరుగుతుంది. తప్పులు చేయడం వలన పాపం వస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…