Vinayaka Chavithi 2024 : ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వినాయక చవితి వచ్చేసింది. ఈసారి కూడా భక్తులు పెద్ద ఎత్తున గణనాథులను ప్రతిష్టించేందుకు, నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వినాయకుడికి పూజలు చేసే సమయంలో కొన్ని విషయాలను మాత్రం మరిచిపోకూడదని పండితులు చెబుతున్నారు. ఇక ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వినాయక చవితి రోజున ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే మంచిదని పురోహితులు చెబుతున్నారు. ప్రమిదలో కొబ్బరినూన పోసి 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి.
ఇలా దీపం వెలిగిస్తే గణనాథుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు. 21 పత్రాలతో పూజించడం వీలుకాని వారు గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పించినా అంతే ఫలితం కలుగుతుందని చెబుతున్నారు. ఇక పండుగ నాగు ఎరుపు, నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయని వారు చెబుతున్నారు. కనుక పండితులు చెబుతున్న ఈ విషయాలను మరిచిపోకండి. ఇక వినాయక చవితి రోజు మంచి ముహుర్తం ఎప్పుడు ఉంది, పూజ ఎప్పుడు చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది వినాయక చవితి తిథి సెప్టెంబర్ 6, 7 తేదీల్లో వచ్చిందని పండితులు చెబుతున్నారు. అయితే ధృక్ సిద్ధాంతం ప్రకారం 7నే (శనివారం) వినాయక చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11.03 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపనకు శుభ ముహుర్తం ఉందని అన్నారు. సాయంత్రం 6.22 గంటల నుంచి రాత్రి 7.30 గంటల మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఇక ప్రతిసారి లాగే ఈసారి కూడా మట్టి వినాయకులనే పూజించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక అర్థం ఉంటుంది. ప్రతి వేడుకా పర్యావరణ హితంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. గణేష చతుర్ధికి వాడే పూజ పత్రాలన్నీ ప్రకృతి సిద్ధమైనవే. మరి పార్వతీ పుత్రుడి విగ్రహాలను మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవి ఎందుకు వాడాలి..? నిమజ్జనం అనంతరం నీటిలో సులువుగా కలిసిపోయేలా, ప్రకృతికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఉండే మట్టి గణనాథుల్నే పూజకు వినియోగించాలి. ఆ గణపయ్య కృపకు పాత్రులు కావాలి.. అని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…