Best Remedies To Remove Kidney Stones : మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలు మన శరీరలోని వ్యర్థాలను వడబోస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీంతో శరీరం ఎప్పటికప్పుడు వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే పలు కారణాల వల్ల కొందరికి కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతుంటాయి. నీళ్లను సరిగ్గా తాగకపోవడం వాటిలో ఒక ముఖ్య కారణం అని చెప్పవచ్చు. రోజూ కొందరు తగిన మోతాదులో నీళ్లను తాగరు. దీని వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. అవి కిడ్నీల వరకు ప్రయాణించి అక్కడే రాళ్లుగా తయారవుతాయి. కనుక కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు ఆ సమస్య మరింత ఎక్కువ అవొద్దంటే రోజూ తగినంత మోతాదులో నీళ్లను తాగాల్సి ఉంటుంది.
ఇక కిడ్నీ స్టోన్లు ఉన్నవారు పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక టీస్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీంతో కిడ్నీల్లోని రాళ్లు కరిగిపోతాయి. అలాగే ఒక టీస్పూన్ తులసి ఆకుల రసంలో కాస్త తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా చేసినా కూడా సమస్య నుంచి బయట పడవచ్చు.
కిడ్నీ స్టోన్లు ఉన్నవారు కొత్తిమీర ఆకులను వేసి మరిగించిన నీళ్లను తాగుతుంటే చక్కని ఉపశమనం లభిస్తుంది. కిడ్నీల్లోని రాళ్లు కరిగిపోతాయి. అలాగే అరకిలో పెసర పప్పును లీటర్ నీటిలో కాచిన అనంతరం పైన తేరే కట్టును తాగలి. అదేవిధంగా వేపాకులను కాల్చి బూడిద చేసి ఒక రోజున నిల్వ చేసిన అనంతరం ఆ మిశ్రమాన్ని రెండు పూటలా నీళ్లలో కలిపి తాగుతుండాలి. ఇలా చేస్తున్నా కూడా కిడ్నీల్లోని రాళ్లను కరిగించుకోవచ్చు.
అయితే కిడ్నీ స్టోన్లు ఉన్నవారు రోజూ తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. టమాటా, క్యాబేజీ, పాలకూర వంటివి ఈ జాబితాకు చెందుతాయి. కనుక కిడ్నీ స్టోన్లు ఉన్నవారు కేవలం పైన తెలిపిన చిట్కాలను మాత్రమే కాకుండా సరైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అప్పుడే సమస్య నుంచి త్వరగా బయట పడతారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…