Sravanam : అధిక మాసం అంటే ఏమిటి..? ఈసారి రెండు శ్రావణ మాసాలు వచ్చాయి తెలుసా..?

July 20, 2023 10:47 AM

Sravanam : తెలుగు నెలలు చైత్రంతో మొదలు అవుతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఐదవ నెల. ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం ఈ నెలలో పాలిస్తుంది. అందుకే దీన్ని శ్రావణ మాసం అని అంటారు. ఈ తెలుగు నెలలో ఈశ్వరుడిని, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఈ నెలలోనే వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వస్తాయి. నాగ పంచమి, రాఖీ పౌర్ణమి వంటివి కూడా వస్తాయి.

కానీ ఈసారి రెండు శ్రావణ మాసాలు వచ్చాయి. ప్రతి ఏడాది కూడా ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం 12 నెలలు. తెలుగు పంచాంగం ప్రకారం కూడా 12 నెలలే వస్తూ ఉంటాయి.  అయితే 2023లో అధిక శ్రావణ మాసంతో 13 నెలలు వచ్చాయి. ప్రతి మూడేళ్లకు ఒక మాసం ఎక్కువగా వచ్చి 13 నెలలు వస్తుంటాయి. ఎందుకు రెండు శ్రావణ మాసాలు వచ్చాయి..? ఈ శ్రావణ మాసంని ఏం అంటారు..? అసలు ఈ శ్రావణ మాసంలో ఏం చెయ్యాలి వంటివి ఇప్పుడు చూద్దాం.

Sravanam this time 2 months came
Sravanam

అధిక శ్రావణ మాసం 19 ఏళ్లకు ఓ సారి వస్తుంది. ఇలా వచ్చే దానినే అధిక శ్రావణం అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం చూస్తే జూలై 18 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు కూడా అధిక శ్రావణ మాసం ఉంది.  ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు నిజ శ్రావణం. దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటైన ఈ శ్రావణ మాసంలో శివుడిని ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది.

ఈ అధిక మాసంలో పెళ్లిళ్లు చేసుకోకూడదు. అలానే కొత్త షాపుల‌ని మొదలు పెట్టడం వంటివి అధిక మాసంలో చెయ్యకూడదు. కొత్త ఇంటి కోసం భూమి పూజలు చేయడం వంటివి చేయకూడదు. అదే విధంగా ఉపనయనము, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు కూడా చేసుకోకూడదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment