రాఖీ పౌర్ణమి రోజు నుంచి.. ఈ రాశుల వారికి అదృష్టం యోగం..

August 22, 2021 3:18 PM

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని, రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమి నుంచి చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలోనే కుంభ రాశిలో గురుడు కూడా ఉండటం వల్ల ఈ రెండింటి కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ గజకేసరీ యోగం ప్రభావం ద్వాదశ రాశులపై కొంతమేర ప్రభావం చూపినప్పటికీ కొన్ని రాశుల వారికి అదృష్టం అని చెప్పవచ్చు. మరి ఆ రాశులు ఏమిటంటే..

కుంభరాశి: కుంభరాశి వారికి ఈ పౌర్ణమి నుంచి అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పవచ్చు. గజకేసరి యోగం ఉండటం వల్ల ఏ రాశి వారు చేపట్టిన పనులు అన్నింటిలోనూ విజయవంతం అవుతారు. ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి.

ధనస్సు రాశి: ధనస్సు రాశి వారికి గజకేసరి యోగం ప్రభావం అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన అవకాశాలు దక్కడమే కాకుండా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశి వారికి ఇతరుల నుంచి సహాయ సహకారాలు దక్కడం వల్ల చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

మీన రాశి: మీన రాశి వారి ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ ఇక స్వస్తి చెప్పవలసిన సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి గజకేసరి ప్రభావం పుష్కలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీన రాశి వారికి ఇంటాబయటా ప్రశంసలు లభిస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment