Bed : బెడ్ కింద 21 రోజుల పాటు వీటిని పెట్టుకోండి.. అన్ని స‌మ‌స్య‌లు గ‌ట్టెక్కుతాయి..!

August 9, 2023 5:46 PM

Bed : మన పూర్వీకులు ఎన్నో పద్ధతుల్ని పాటించేవారు. వాటిని కూడా ఇంకా చాలా మంది పాటిస్తూనే ఉన్నారు. అయితే, ఒక్కొక్క సారి మనకి ఏదైనా పరిష్కారాన్ని జ్యోతిష్య పండితులు కానీ లేదంటే పెద్దలు కానీ చెప్తూ ఉంటారు. వాటిని ఆచరిస్తే, మంచి జరుగుతుందని శుభం కలుగుతుందని అంటూ ఉంటారు. మన జీవితంలో కష్టం, సుఖం రెండు ఉంటాయి. ఏది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు చెప్పలేము.

అయితే, ఇక్కడ కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వీటిని కనుక పాటించినట్లయితే, కచ్చితంగా ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. కొందరికి కోపం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవడానికి, రాత్రి నిద్ర పోయేటప్పుడు రాగి పాత్రలో నీళ్లు పోసి, మంచం కింద కానీ పక్కన కానీ పెట్టుకోవాలి. అలానే రాత్రిపూట దిండు కింద, ఒక ఎర్రచందనం చెక్కని పెట్టడం వలన కోపం కంట్రోల్ లో ఉంటుంది. కొంత మందికి దృఢ సంకల్పం పెంచుకోవాలని ఉంటుంది.

put these items under the bed for 21 days see what happens
Bed

దృడ సంకల్పం పెరగాలంటే, వెండి పాత్రలు కానీ ఏదైనా చిన్న వెండి గిన్నెలో కానీ నీళ్ళు పోసి మంచం కింద పెట్టుకోవాలి. వెండితో తయారుచేసిన వస్తువులని పెట్టుకుంటే కూడా దృఢ సంకల్పం పెరుగుతుంది. బంగారం కానీ వెండి అభరణాలను కానీ దిండు కింద పెట్టుకుని నిద్రపోతే, జన్మ కుండలిలోని దోష నివారణ అవుతుంది.

దృష్టి దోషాలు తొలగిపోవాలంటే, ఇనుముతో చేసిన పాత్రలో నీళ్లు పోసి, 21 రోజుల పాటు మంచం కింద పెట్టుకుంటే, దృష్టి దోషాలు తొలగిపోతాయి. జాతిరత్నమైన నీలం ని కూడా దిండు కింద పెట్టుకుంటే, చెడు దోష నివారణ జరుగుతుంది. అలానే అదృష్టం కలగాలంటే, వెండితో చేసిన చేపలని దిండు కింద పెట్టుకోవాలి. వెండి పాత్రలో నీళ్లు పోసి అందులో వెండి చేపని పెడితే కూడా చక్కటి ఫలితం కనబడుతుంది. ఇలా మీరు వీటిని కనుక పాటించినట్లయితే, ఈ బాధల నుండి బయటపడి హాయిగా జీవించొచ్చు.

Bed

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment