Mopidevi Temple : దక్షిణ భారతదేశం లోని షణ్ముఖ దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ వుంటారు. మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం కి వెళ్లి మన కోరికలు చెబితే అవి తీరిపోతాయి. స్కాంద పురాణంలో కూడా కృష్ణానది మహత్య్మం, మోపిదేవి క్షేత్ర మహిమల గురించి వివరించారు.
దూర దూర ప్రాంతాల నుండి కూడా ఈ ఆలయానికి వచ్చి భక్తుల సుబ్రమణ్య స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి వినికిడి లోపం ఉన్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేనివారు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా వెళుతూ ఉంటారు. ఇక్కడికి వెళ్లి భగవంతుడిని కోరుకుంటే ఆ సమస్య నుండి బయట పడచ్చని భక్తుల నమ్మకం.
అలానే ఏమైనా దోషాలు ఉన్న వాళ్లు కూడా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఆ సమస్య నుండి బయటపడాలని పూజలు చేయించుకుంటారు. ఇది చాలా శక్తివంతమైన ఆలయం ఈ ఆలయం లో సంతానం లేని వాళ్ళు ఒక రాత్రి నిద్ర చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని అంటూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు శివలింగ ఆకారంలో ఉంటారు. ఒక పాము చుట్టలు చుట్టుకున్నట్లుగా ఉంటుంది. దాని మీద లింగాకారంలో స్కందుడు కొలువై ఉంటారు. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలనేది తెలుసుకుందాం.
విజయవాడ నుండి రెండు గంటల ప్రయాణం. విజయవాడ – అవనిగడ్డ దారిలో ఈ ఆలయం ఉంది. విజయవాడ నుండి అవనిగడ్డ వెళ్లే బస్సులు చాలా ఉంటాయి. ప్రతి రెండు గంటలకి కూడా కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి మీదుగా విజయవాడ నుండి బస్సులు ఉంటాయి. విజయవాడ నాగాయలంక బస్సులు కూడా ఇక్కడికి వెళ్తాయి. రైల్వే స్టేషన్ నుండి ఆటోలు కూడా ఉంటాయి. ఈ ఆలయానికి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ రేపల్లె. ఈ ఆలయానికి దగ్గరలో ఉండే ఎయిర్ పోర్ట్ గన్నవరం అక్కడి నుండి బస్సు లేదా ప్రైవేట్ టాక్సీల ద్వారా మీరు ఆలయానికి చేరుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…