Lakshmi Devi : సిరి సంప‌ద‌లు క‌ల‌గాలంటే.. అమ్మ‌వారిని అస‌లు ఎలా పూజించాలి..?

June 28, 2023 7:23 PM

Lakshmi Devi : పిల్లలు కావాలన్నా, కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి అవ్వాలన్నా అమ్మవారిని కోరుకుంటే చక్కటి ఫలితాలని పొందొచ్చు. అనుకున్న కోరికలు తీరుతాయి. అమ్మ వివిధ రూపాల్లో ఉంటారు. కాళీ, చండీ, లలితాదేవి, దుర్గాదేవి, బాలా త్రిపుర సుందరి ఇలా.. అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయి. అమ్మవారు సకలవ్యాప్తం అయ్యి ఉన్నారు. ఆకలి రూపం, శాంతి రూపం, మాతృ రూపం, జాతి రూపం, దయ, నిద్ర, బుద్ధి ఇలా అమ్మవారు వివిధ రూపాల్లో ఉంటారు. అమ్మవారికి నవరాత్రులు అంటే చాలా ఇష్టం. నవరాత్రుల విశేషంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.

చాలా మంది ప్రతి మంగళవారం కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. మంగళవారం అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి శత్రుపీడలు ఉండవు. అప్పులు, రుణాలు తీరిపోతాయి. రోగ నివారణ, పూజ గ్రహ దోషాలు ఇలా అన్నింటికీ పరిహారం దొరుకుతుంది. అమ్మవారికి మంగళవారం అంటే చాలా ఇష్టమని అంటూ ఉంటారు. అమ్మవారి కరుణ ఎక్కడ ఉంటుందో ఆ ఇంటి నుండి అమ్మవారు రాదు. అక్కడే నివసిస్తుంది.

Lakshmi Devi told how to do pooja to her
Lakshmi Devi

అయితే అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు, వ్రతాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారు, శివుడు ఆనందతాండవం చేస్తారట. ఆ సమయంలో పూజలు చేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టం. అర్ద నతకరీ అని, అనంత తృతీయ, రసకల్యని అని వ్రతం చాలా ఇష్టం అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయడం కూడా వారికి చాలా ఇష్టం.

అలానే కృష్ణ చతుర్దశి, ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి కూడా అమ్మవారిని ప్రార్థిస్తే, అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు నాడు కూడా అమ్మవారిని కొలిస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. అమ్మవారికి వసంత నవరాత్రులు ఎందుకు ఇష్టమంటే శ్రీ రామ లలితాంబికా శ్రీకృష్ణ శ్యామలంబ అంటారు. లలిత స్వరూపమే శ్రీరాముడు. రాముడికి పూజ చేసినా అమ్మవారికి పూజ చేసినట్లే అందుకనే రామ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి పూజలు చేస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment