Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటారు. లక్ష్మీ దేవి ఇంట్లో ఉంటే, ఇక ఎలాంటి లోటు కూడా ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, మనం కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. అయితే, లక్ష్మీ దేవి పాదాలకి పూజ చేయకూడదని చాలా మంది అంటూ ఉంటారు. నిజంగా లక్ష్మీదేవి పాదాలని పూజించకూడదా..? ఈ సందేహం మీకు కూడా ఉన్నట్లయితే ఇప్పుడే తెలుసుకోండి.
లక్ష్మీదేవి పాదాలని పూజించ వచ్చా లేదా అనే విషయానికి వస్తే, శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో, పాదాలని ఆశ్రయించాలి. అమ్మవారిని మాత్రం పాదాలకి పూజించకూడదు అని అంటారు. అయితే, వాస్తవానికి పరమేశ్వరి, పరమేశ్వరుడు ఒకరే. లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ అందరూ కూడా ఒకటే. కాబట్టి, ఏ సందేహం లేకుండా అమ్మవారి పాదాలని పూజించొచ్చు.
అందులో తప్పులేదు. ఎలాంటి పాపం తగలదు. అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్లినా, లేదంటే ఏ అమ్మవారి క్షేత్రానికి వెళ్లినా పూజారి మనకి శఠకోపం పెడతారు. దానిమీద పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్లి నమస్కరించుకున్న తర్వాత శఠగోపం పెడతారు కదా.. దాని మీద కూడా అమ్మవారి పాదాలు ఉంటాయని గమనించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ఒక్కసారి పరిశీలించినట్లయితే, చంచలాయే నమః పాదౌ పూజ్యామి ఇలా సర్వాంగాలని పూజ చేయడానికి మంత్రాలు ఉంటాయి.
ఇక్కడే పాదాలని పూజించవచ్చని చెప్పబడింది. కాబట్టి పాదాలని తప్పనిసరిగా పూజించడం మంచిది. పాదాలని పూజించకూడదు అనేది ఏమీ లేదు. కచ్చితంగా పాదాలని పూజించవచ్చు కాబట్టి పాదాలని కచ్చితంగా పూజించవచ్చు. అందులో తప్పులేదు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు, పాదాలని పూజించకూడదు అని ఎవరైనా చెప్తే, మీరు వాటిని పాటించాల్సిన పనిలేదు. మీరు నిర్భయంగా పాదాలని పూజించవచ్చు. అందులో పొరపాటు ఏమీ ఉండదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…