Diabetes : చాలామంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్, బీపీ కామన్ గా వస్తున్నాయి. షుగర్ రాకూడదని, ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. పైగా షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. షుగర్ వచ్చిన తర్వాత, ఆహారం పట్ల అనేక నియమాలని పాటిస్తున్నారు. అయితే, షుగర్ తో బాధపడే వాళ్ళు షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే, అల్పాహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి..? అల్పాహారం తీసుకునేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ తో బాధపడే వాళ్ళు, ఈజీగా దీనిని తయారు చేసుకుని తీసుకోవచ్చు. రాత్రంతా నల్ల శనగలని నానబెట్టి, మరుసటి రోజు కుక్కర్ లో ఉడకపెట్టుకుని, తరిగిన ఉల్లిపాయలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకి బాగుంటుంది. అల్పాహారానికి బదులుగా మీరు ఇలా తీసుకోవచ్చు. అలానే, షుగర్ తో బాధపడే వాళ్ళు మినప పప్పుని తీసుకుంటే కూడా మంచిది. అయితే, మినప పప్పుని తీసుకునేటప్పుడు మీరు పొట్టు పప్పును తీసుకోండి. షుగర్ పేషెంట్లకు ఇది బాగా మేలు చేస్తుంది.
ఈ మినప పప్పు తీసుకుంటే, చక్కటి ప్రయోజనాలు లభిస్తాయి. అలానే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అలానే, షుగర్ తో బాధపడే వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. రాగి దోశ వంటి వాటిని కూడా షుగర్ తో బాధపడే వాళ్ళు తీసుకుంటే మంచిది.
గుడ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు, గుడ్లు తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అని స్టడీ చెప్తోంది. బెర్రీస్ తో గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. రాత్రి పూట చియా సీడ్స్ ని తీసుకుంటే షుగర్ పేషంట్లకి ఎంతో మేలు కలుగుతుంది. చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని ఇది తగ్గించగలదు. అలానే ఓట్ మీల్ ని కూడా షుగర్ పేషెంట్లు తీసుకోవడం మంచిది. మల్టీ గ్రైన్ అవకాడో టోస్ట్ తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఇలా షుగర్ తో బాధపడే వాళ్ళు వీటిని తీసుకుని షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…