Lakshmi Devi : లక్ష్మీదేవి పాదాలకి పూజ చేయకూడదా..?

August 14, 2023 3:53 PM

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటారు. లక్ష్మీ దేవి ఇంట్లో ఉంటే, ఇక ఎలాంటి లోటు కూడా ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, మనం కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. అయితే, లక్ష్మీ దేవి పాదాలకి పూజ చేయకూడదని చాలా మంది అంటూ ఉంటారు. నిజంగా లక్ష్మీదేవి పాదాలని పూజించకూడదా..? ఈ సందేహం మీకు కూడా ఉన్నట్లయితే ఇప్పుడే తెలుసుకోండి.

లక్ష్మీదేవి పాదాలని పూజించ వచ్చా లేదా అనే విషయానికి వస్తే, శ్రీమన్నారాయణుని ఆశ్రయించే సమయంలో, పాదాలని ఆశ్రయించాలి. అమ్మవారిని మాత్రం పాదాలకి పూజించకూడదు అని అంటారు. అయితే, వాస్తవానికి పరమేశ్వరి, పరమేశ్వరుడు ఒకరే. లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ అందరూ కూడా ఒకటే. కాబట్టి, ఏ సందేహం లేకుండా అమ్మవారి పాదాలని పూజించొచ్చు.

Lakshmi Devi feet can we do pooja to them
Lakshmi Devi

అందులో తప్పులేదు. ఎలాంటి పాపం తగలదు. అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్లినా, లేదంటే ఏ అమ్మవారి క్షేత్రానికి వెళ్లినా పూజారి మనకి శఠకోపం పెడతారు. దానిమీద పాదములే ఉంటాయి. లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్లి నమస్కరించుకున్న తర్వాత శఠగోపం పెడతారు కదా.. దాని మీద కూడా అమ్మవారి పాదాలు ఉంటాయని గమనించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ఒక్కసారి పరిశీలించినట్లయితే, చంచలాయే నమః పాదౌ పూజ్యామి ఇలా సర్వాంగాలని పూజ చేయడానికి మంత్రాలు ఉంటాయి.

ఇక్కడే పాదాలని పూజించ‌వ‌చ్చని చెప్పబడింది. కాబట్టి పాదాలని తప్పనిసరిగా పూజించడం మంచిది. పాదాలని పూజించకూడదు అనేది ఏమీ లేదు. కచ్చితంగా పాదాలని పూజించవచ్చు కాబట్టి పాదాలని కచ్చితంగా పూజించ‌వ‌చ్చు. అందులో తప్పులేదు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు, పాదాలని పూజించకూడదు అని ఎవరైనా చెప్తే, మీరు వాటిని పాటించాల్సిన ప‌నిలేదు. మీరు నిర్భ‌యంగా పాదాలని పూజించ‌వ‌చ్చు. అందులో పొరపాటు ఏమీ ఉండ‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now