ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా.. అయితే శ్వేతార్కమూల వినాయకుడిని పూజించాల్సిందే!

September 15, 2021 1:04 PM

సాధారణంగా మనం ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కొన్ని సార్లు అనేక ఆర్థిక ఇబ్బందులు, జాతక దోషాలు, మానసిక ఆందోళనలు మనల్ని చుట్టుముడతాయి. ఈ విధమైనటువంటి బాధల నుంచి బయటపడటానికి మనం ఎన్నో రకాల దేవదేవతలను పూజిస్తాము. అయితే వినాయకుడు అందరు దేవుళ్ళలోకల్లా ఎంతో ప్రత్యేకమైన దేవుడని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వినాయకుడిని మనం వివిధ రూపాల్లో పూజిస్తాం. ఇలా ఎన్నో రూపాలలో దర్శనమిచ్చే వినాయకుడి రూపాలలో శ్వేతార్కమూల గణపతి ఒకటి.

ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా.. అయితే శ్వేతార్కమూల వినాయకుడిని పూజించాల్సిందే!

శ్వేతార్కమూల అంటే తెల్లజిల్లేడు చెట్టు మొదలు అని అర్థం. హిందూ సాంప్రదాయాల ప్రకారం తెల్ల జిల్లేడు చెట్టును ఎంతో పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ తెల్లజిల్లేడు చెట్టును శ్వేతార్కమూల గణపతిగా భావించి పూజలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, జాతక దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు. మరి ఈ గణపతి ని ఏ విధంగా పూజించాలి అనే విషయానికి వస్తే..

ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం కలసి వచ్చేటప్పుడు తెల్లజిల్లేడు చెట్టు మొదలును  సేకరించడం అత్యంత శ్రేష్టం. ఆరోజు ఉదయాన్నే శుచిగా శుభ్రం చేసి మట్టిలో నుంచి శ్వేతార్కమూలం సేకరించి, మూలాన్ని శుభ్రంగా కడిగి పూజగదిలో ఎర్రని వస్త్రం పై ధూప దీప నైవేద్యాలతో పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మరికొందరు ఈ జిల్లేడు కొమ్మపై వినాయకుడి ప్రతిమలు చేయించుకుని పూజలు చేస్తుంటారు. ఇలా శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment