ప‌ర్సులో ఇవి పెట్టుకుంటే ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది.. డ‌బ్బే డబ్బు..!

September 17, 2021 11:08 AM

జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాత్రి పగలు కష్టపడుతూ డబ్బుని సంపాదిస్తున్నప్పటికీ చివరికి మన పర్స్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా మనం సంపాదించిన డబ్బు మన చేతిలో నిలవాలంటే తప్పకుండా కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మన చేతిలో డబ్బు నిలవాలంటే తప్పకుండా మన ప‌ర్సులో కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ప‌ర్సులో ఇవి పెట్టుకుంటే ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది.. డ‌బ్బే డబ్బు..!

 

మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మన చేతిలో డబ్బు నిలవాలంటే తప్పనిసరిగా మన ప‌ర్సులో లక్ష్మీదేవి ఫొటో ఉండాలి. అయితే లక్ష్మీదేవి కూర్చొని ఉన్నటువంటి ఫోటోను పెట్టుకోవడం ఎంతో శుభకరం. అదేవిధంగా హిందువులు రావి ఆకులను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఒక రావి ఆకును తీసుకుని దాన్ని గంగాజలం (నీరు)తో కడిగి ఆ ఆకుపై గంధంతో శ్రీ అని రాసి మన ప‌ర్సులో పెట్టుకోవాలి. ఈ ఆకు ఎండిపోతున్న సమయంలో తిరిగి మరో ఆకుతో ఇలా చేస్తూ ఉండాలి. దీని వల్ల మనకు సంపద కలసి వస్తుంది.

మన చేతిలో ఉన్న డబ్బు వృథాగా ఖర్చు అవుతూ ఉంటే వెంటనే ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో 21 బియ్యపు గింజలను వేసి ఆ కవర్ ను ప‌ర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు వృథా ఖర్చులకు కాకుండా డబ్బును ఆదా చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో మీ పెద్దవారు ఎంతో ప్రేమగా ఇచ్చిన డబ్బును ఎల్లప్పుడూ మీ పర్సులో ఉంచుకోవడం ఎంతో ఉత్తమం. ఈ డబ్బులను ఎలాంటి పరిస్థితులలోనూ ఖర్చు చేయకుండా ఉండటం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. మన చేతిలో డబ్బులు ఉండాలంటే మన పర్సులో తప్పనిసరిగా ఒక వెండి నాణెం ఉండాలి. ముందుగా ఈ వెండి నాణెం లక్ష్మీ దేవికి సమర్పించి పూజలు చేసిన అనంతరం పర్సులో ఉంచాలి. దీనివల్ల మనకు ఎలాంటి వృథా ఖర్చులు కాకుండా ఉంటాయి. డబ్బుకు లోటు ఉండదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment