ఆదాయం పెరగాలంటే.. చేయవలసిన పనులు.. ఇలా చేస్తే చాలు..!

June 17, 2023 4:56 PM

డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంతో కూడుకున్న పనో అందరికీ తెలిసిందే. ఉద్యోగం లేదా వ్యాపారం.. ఏదైనా సరే ఒక్క రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అయితే కొందరికి ఆదాయం బాగానే ఉంటుంది. కానీ కొందరు మాత్రం చాలీ చాలని ఆదాయంతో నెట్టుకొస్తుంటారు. బిజినెస్‌ లేదా ఉద్యోగం ఎందులో అయినా సరే కొందరు సంపాదించే డబ్బు వారికి ఖర్చులకు సరిపోదు. దీంతో సేవింగ్స్‌ చేయలేకపోతుంటారు. అయితే కింద తెలిపిన విధంగా పలు పనులు చేస్తే చాలు.. దాంతో ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం పెరుగుతుంది. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

చాలా మంది తమ ఇంటి ఆవరణ లేదా బయట ఎక్కడైనా వేరే ప్రదేశాల్లో ఉండే చెట్లు లేదా మొక్కలను నాశనం చేస్తుంటారు. అలా చేయరాదు. పచ్చని చెట్లను లేదా మొక్కలను నరికినా, నాశనం చేసినా పాపం చుట్టుకుంటుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి. దానికి బదులుగా మొక్కలను పెంచడం అలవాటు చేసుకోండి. మొక్కలు ఎంత పచ్చగా పెరిగితే అంత మంచిది. దీంతో డబ్బుకు లోటు ఉండదు. రెండు చేతులా సంపాదిస్తారు. ఆర్థిక సమస్యలు పోతాయి.

how to increase income follow these remedies

రాత్రి పూట ఒక రాగి చెంబులో ఒక మందార మొగ్గను వేయండి. మరుసటి రోజు ఉదయం స్నానం చేశాక బయటకు వెళ్లే ముందు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. అనంతరం మందార మొగ్గను తీసేసి ఆ నీళ్లను తాగండి. తరువాత బయటకు వెళ్లండి. ఇలా 41 రోజుల పాటు చేయండి. 42వ రోజు నుంచి మీ కష్టాలు తీరిపోవడాన్ని మీరు గమనిస్తారు. డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.

ప్రతి రోజూ పేదలకు ఆహారం పెట్టండి. లేదా మూగజీవాలకు ఆహారం, నీరు పెట్టవచ్చు. ఇలా చేసినా కూడా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అలాగే రోజూ ఉదయం వేకువ జామున స్నానం చేసి ఒక గంట పాటు కనకధారా స్తోత్రం చదవండి. ఇలా చదివేటప్పుడు పసుపు రంగు లేదా తెలుపు రంగు దుస్తులను ధరించండి. దీంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది. డబ్బు చేతిలో నిలుస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అనుకున్నది నెరవేరుతుంది. వ్యాపారంలో కోట్లు సంపాదిస్తారు. ఈ విధమైన చిట్కాలను పాటించడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment