Money : ఈ టిప్స్ పాటిస్తే చాలు.. ధ‌నం ల‌భిస్తుంది.. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి..!

August 15, 2023 11:53 AM

Money : భవిష్యత్తులో అంతా మంచి జరగాలని అందరూ కోరుకుంటారు. ఏ సమస్యలు రాకుండా హాయిగా జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఆర్థిక సమస్యల‌తో కూడా చాలామంది సతమతమవుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీదేవి ఇంట కొలువై ఉండాలంటే ఇలా చేయండి. మీ ఇంట్లో కనుక ఇలా చేసినట్లయితే క‌చ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఆర్థిక బాధలే ఉండవు. ధనవంతులు అయిపోవచ్చు.

ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కొచ్చు. సంపద లేకపోతే సంతోషం ఉండదు. సంతోషం లేకపోతే ఆరోగ్యంతోపాటుగా ఎన్నో నష్టాలు కలుగుతాయి. సంపద ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది. అయితే మీ ఇంట్లో సంపద చేకూరాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవితోపాటుగా విష్ణుమూర్తిని కూడా నిత్యం కొలుస్తూ ఉండాలి.

follow these simple tips to get rid of money problems
Money

అప్పుడు లక్ష్మీదేవికి ఇంకా ప్రీతి కలిగి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఎక్కడైతే నిత్యం విష్ణు నామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. పైగా ఆ ఇంట సంపదలకి లోటే ఉండదట. ఎల్లో కౌరీస్ అనే గవ్వలని తెచ్చుకోండి. వాటిని ఒక 7 తీసుకుని, జేబులో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఆర్థికంగా నష్టాలు ఏమీ ఉండవు. అలానే, గోమతి చక్రాలని కూడా మీ దగ్గర ఉంచుకుంటే ఆర్థిక లాభం కలుగుతుంది. శత్రువుల బాధ నుండి బయటపడొచ్చు.

తామర పువ్వు విత్తనాలను పెట్టుకుంటే కూడా ఖర్చులు తగ్గుతాయి. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. శనివారం రావి చెట్టు ఆకుని తీసుకుని, నీటితో శుభ్రంగా కడిగి ఆకు మీద హ్రీమ్ రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. లక్ష్మీదేవికి బియ్యంతో పూజ చేసి, అందులో కొంత బియ్యాన్ని మీ దగ్గర పెట్టుకుంటే కూడా ఆర్థిక సమస్యల నుండి తొలగిపోవచ్చు. శ్రీ యంత్రాన్ని ఎప్పుడూ మీ దగ్గర పెట్టుకుంటే కూడా డబ్బుకి లోటు ఉండదు. ఇలా ఆర్థిక సమస్యల నుండి దూరంగా ఉండవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now