పూజలో దర్భల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా ?

July 14, 2021 4:17 PM

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు దర్భలు ఉపయోగించడం చూస్తుంటాము. హోమాలు, యాగాలు, పితృ కర్మలు దేవతా ప్రతిష్ఠలు చేసేటప్పుడు దర్భలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ విధంగా దర్భలను ఉపయోగించడానికి కారణం ఏమిటి? పూజలో దర్భల ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

దర్భలు ఒక రకమైన గడ్డి జాతి మొక్క. ఈ దర్భలు శ్రీరాముని స్పర్శకు నోచుకోవడం వల్ల వీటికి అంత ప్రాముఖ్యత ఉంది.అధిక ఉష్ణ శక్తి కలిగిన వీటిని నీటిలో వేయడం వల్ల నీటిని శుభ్రపరుస్తుంది కనుక సూర్యుడు నుంచి లేదా చంద్రుని నుంచి వెలువడే కిరణాల నుంచి నీటిని శుభ్ర పరచడానికి నీటిలో, ఇతర ఆహార పదార్థాలలో ఈ దర్భలు వేస్తారు.

ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఉంగరపు వేలుకు రెండు దర్భలతో చేసిన ఉంగరాన్ని తొడుగుతారు. పితృకార్యాలు చేసేటప్పుడు 3, దేవ కార్యాలలో 4 దర్భలతో తయారు చేసిన ఉంగరాన్ని వేలికి ధరిస్తారు. ఈ దర్భ అడుగుభాగాన బ్రహ్మదేవుడు, మధ్యభాగంలో విష్ణుమూర్తి, దర్భ శిఖరాన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటాడని చెబుతారు. ఎంతో పవిత్రమైన ఈ దర్భలను వినాయకుడికి సమర్పించే పూజించడం వల్ల కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment