చీపురు లక్ష్మీదేవికి సమానం.. చీపురును వంటగదిలో ఉంచవచ్చా?

August 11, 2021 9:20 PM

మన ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురును ఎంతో పవిత్రంగా భావిస్తారు. చీపురును సరైన మార్గంలో ఉపయోగించడం వల్ల మన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.అలా కాకుండా చీపురు ఇష్టానుసారంగా వాడటం వల్ల అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. కనుక చీపురును సరైన మార్గంలో వాడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలము. ఈ క్రమంలోనే చీపురును ఎలా ఉపయోగించాలి..?చీపురును వంటగదిలో ఉంచవచ్చా? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

లక్ష్మీదేవి సమానంగా భావించి చీపురును ఎప్పుడూ కూడా బహిరంగ ప్రదేశాలలో పెట్టకూడదు. వాస్తు ప్రకారం చీపురును పశ్చిమ దిశలో ఉంచడం ఉత్తమం. బయటనుంచి వచ్చిన వ్యక్తులకు చీపురు కనపడకుండా దాచి పెట్టాలి. అదేవిధంగా చీపురతో గట్టిగా కొట్టకూడదు ఎప్పుడు పడితే అప్పుడు చీపురును తాకకూడదు. అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత మన ఇంట్లో చెత్తను ఊడ్చకూడదు.

వాస్తు ప్రకారం చీపురును ఎప్పుడు పడితే అప్పుడు మార్చకూడదు. ముఖ్యంగా విరిగిపోయిన చీపురుతో ఇంట్లో ఊడ్చకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చీపురును కొనుగోలు చేయడానికి కృష్ణపక్షం ఎంతో సరైనది. అలాగే శనివారం కొత్త చీపురును ఉపయోగించడం వల్ల శుభం కలుగుతుంది అని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment