Coconut Offering To God : హిందువులు ఏ కార్యం తలపెట్టినా లేదంటే దేవాలయాలను సందర్శించినా, పూజలు చేసినా తప్పనిసరిగా పూజ అనంతరం కొబ్బరికాయ కొడుతుంటారు. ఇక కొందరు అయితే వారంలో తమ ఇష్టదైవాన్ని పూజించిన రోజు తప్పకుండా కొబ్బరికాయ కొడతారు. శుభకార్యాల్లోనూ వీటి వాడకం ఎక్కువగానే ఉంటుంది. అయితే కొబ్బరికాయలు ఎందుకు అంత పవిత్రం అయ్యాయి ? పూజ చేసినప్పుడు కేవలం వీటినే ఎందుకు కొడతారు ? కొబ్బరికాయలకు అంత ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరికాయలో మీద ఉన్న భాగాన్ని మన అహంతో పోలుస్తారు. లోపలి తెల్ల భాగాన్ని స్వచ్ఛమైన మనస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఈ క్రమంలోనే కొబ్బరికాయను పగలగొట్టడం అంటే.. మన అహాన్ని వదిలి స్వచ్ఛమైన మనస్సుతో దైవాన్ని పూజించడం అన్నమాట. అందుకనే కొబ్బరికాయ పగలగొడతారు. ఇక శ్రీహరికి అత్యంత ఇష్టమైన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి. అందుకనే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతారు. అలాగే కొబ్బరికాయకు ఉండే మూడు కళ్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. కనుకనే కొబ్బరికాయ పవిత్రంగా మారింది. అందుకనే దానికి అంత ప్రాధాన్యతను కల్పించారు.
ఇక కొబ్బరితోపాటు అరటి పండ్లను కూడా పవిత్రంగానే భావిస్తారు. వీటిని కూడా నైవేద్యం పెడతారు. వాస్తవానికి కొబ్బరి చెట్లు, అరటి చెట్లు విత్తనాలు లేకుండానే పెరుగుతాయి. వాటి నుంచి వచ్చే పిలకలతో మొక్కలుగా ఎదుగుతాయి. కనుకనే వీటిని పవిత్రంగా భావించి నైవేద్యం కోసం ఉపయోగిస్తారు. ఇక కొబ్బరికాయను కొట్టడం వల్ల నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అందువల్ల కూడా కొబ్బరికాయను కొట్టడం ఆచారంగా వస్తోంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…