Coconut Offering To God : పూజ చేసిన‌ప్పుడు కొబ్బ‌రికాయ‌నే ఎందుకు కొడ‌తారు ?

June 10, 2024 2:31 PM

Coconut Offering To God : హిందువులు ఏ కార్యం త‌ల‌పెట్టినా లేదంటే దేవాల‌యాల‌ను సంద‌ర్శించినా, పూజ‌లు చేసినా త‌ప్ప‌నిస‌రిగా పూజ అనంత‌రం కొబ్బ‌రికాయ కొడుతుంటారు. ఇక కొంద‌రు అయితే వారంలో త‌మ ఇష్ట‌దైవాన్ని పూజించిన రోజు త‌ప్ప‌కుండా కొబ్బ‌రికాయ కొడ‌తారు. శుభ‌కార్యాల్లోనూ వీటి వాడ‌కం ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే కొబ్బ‌రికాయ‌లు ఎందుకు అంత ప‌విత్రం అయ్యాయి ? పూజ చేసిన‌ప్పుడు కేవ‌లం వీటినే ఎందుకు కొడ‌తారు ? కొబ్బ‌రికాయ‌ల‌కు అంత ప్రాధాన్య‌త ఎందుకు ఏర్ప‌డింది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రికాయలో మీద ఉన్న భాగాన్ని మ‌న అహంతో పోలుస్తారు. లోప‌లి తెల్ల భాగాన్ని స్వ‌చ్ఛ‌మైన మ‌న‌స్సుకు చిహ్నంగా భావిస్తారు. ఈ క్ర‌మంలోనే కొబ్బ‌రికాయ‌ను ప‌గ‌ల‌గొట్ట‌డం అంటే.. మ‌న అహాన్ని వ‌దిలి స్వ‌చ్ఛ‌మైన మ‌న‌స్సుతో దైవాన్ని పూజించ‌డం అన్న‌మాట‌. అందుక‌నే కొబ్బ‌రికాయ ప‌గ‌ల‌గొడతారు. ఇక శ్రీ‌హ‌రికి అత్యంత ఇష్ట‌మైన వాటిల్లో కొబ్బ‌రికాయ ఒక‌టి. అందుక‌నే కొబ్బ‌రికాయ కొట్టి నైవేద్యం పెడ‌తారు. అలాగే కొబ్బ‌రికాయ‌కు ఉండే మూడు క‌ళ్లు బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రుల‌ను సూచిస్తాయి. క‌నుక‌నే కొబ్బ‌రికాయ ప‌విత్రంగా మారింది. అందుక‌నే దానికి అంత ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు.

Coconut Offering To God why it became very important item
Coconut Offering To God

ఇక కొబ్బ‌రితోపాటు అర‌టి పండ్ల‌ను కూడా ప‌విత్రంగానే భావిస్తారు. వీటిని కూడా నైవేద్యం పెడతారు. వాస్త‌వానికి కొబ్బ‌రి చెట్లు, అర‌టి చెట్లు విత్త‌నాలు లేకుండానే పెరుగుతాయి. వాటి నుంచి వ‌చ్చే పిల‌క‌ల‌తో మొక్క‌లుగా ఎదుగుతాయి. క‌నుక‌నే వీటిని ప‌విత్రంగా భావించి నైవేద్యం కోసం ఉప‌యోగిస్తారు. ఇక కొబ్బ‌రికాయ‌ను కొట్ట‌డం వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుంది. అందువ‌ల్ల కూడా కొబ్బ‌రికాయ‌ను కొట్ట‌డం ఆచారంగా వ‌స్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now