శనీశ్వరునికి ఇంట్లో పూజలు చేయవచ్చా ?

June 20, 2021 6:17 PM

సాధారణంగా శనీశ్వరుని పేరు వినగానే మనసులో కొంత మేర భయం పుడుతుంది.శని ప్రభావం ఒక్కసారి మన పై పడితే శని ప్రభావం నుంచి కోలుకోవడం కష్టం కనుక శనీశ్వరుని విషయంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. శనీశ్వరునికి పూజలు చేయటం నుంచి మొదలుకొని ప్రతి ఒకటి ఎంతో జాగ్రత్తగా పాటిస్తారు. మరికొందరు శనీశ్వరుని ఆలయానికి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. కానీ కొందరికి మాత్రం శనీశ్వరుని ఫోటోను ఇంట్లో ఉంచుకుని పూజలు చేయవచ్చా? చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆధ్యాత్మిక పండితులు చెప్పిన ప్రకారం మన ఇంట్లో శనీశ్వరుని ఫోటోలు పెట్టుకుని పూజలు చేయకూడదని చెబుతున్నారు. కేవలం శనీశ్వరుని ఫోటోలు మాత్రమే కాకుండా నవగ్రహాల ఫోటోలను మన ఇంట్లో ఉంచుకొని పూజ అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు. నవగ్రహాలు అనేవి ఆయా దేవుడు చెప్పిన పనులను చేయటానికి మాత్రమే ఉంది కనుక నవగ్రహాలను మన ఇంట్లో ఉంచుకొని పూజ చేయకూడదు.

నవగ్రహాలు కేవలం ఆలయాలలో మాత్రమే ఉంటాయి ఆయా గ్రహ దోష పరిహారం నిమిత్తం పండితులు నవగ్రహాలకు ఆలయాలలోని పూజలు చేయాలని చెబుతారు కానీ ఇంట్లో నవగ్రహాలకు పూజలు చేయకూడదు. ముఖ్యంగా శనీశ్వరుని ఫోటోలను మన ఇంట్లో ఉంచుకుని పూజ అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల శని ప్రభావం మన కుటుంబం పై అధికంగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment