గర్భిణీ స్త్రీలు వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారు ?

August 20, 2021 1:54 PM

శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈక్రమంలోనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. వివాహమైన మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవటం వల్ల వారి కుటుంబం ఎంతో సుఖంగా ఉంటుందని, వారి కుటుంబంలో ఆర్థిక అభివృద్ధి ఉంటుందని భావిస్తారు. అయితే గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయకూడదా ? పండితులు ఏం చెబుతున్నారు, అనే విషయానికి వస్తే..

గర్భిణీ స్త్రీలు వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారు ?

సాధారణంగా గర్భం ధరించిన మహిళలలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటాయి కనుక వారు ఎక్కువ సేపు పూజలలో కూర్చోలేరు, అదేవిధంగా పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అయితే గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండటం వల్ల ఆ ప్రభావం వారి గర్భంలో పెరుగుతున్న బిడ్డ పై పడుతుంది. అందుకోసమే గర్భిణీ స్త్రీలు కొన్ని పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెబుతారు.

నిజానికి గర్భిణీ స్త్రీలు ఏ విధమైన పూజలు, వ్రతాలు అయినా చేయవచ్చు. అయితే వీలైనంత వరకు గర్భిణీ స్త్రీలు తొందరగా వారి పూజ పూర్తయ్యేలా చూసుకోవాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉండకుండా పూజ పూర్తయిన తర్వాత వెంటనే అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా భావించి తినాలి. గర్భం దాల్చిన మహిళలు ఏ విధమైన సంకోచం లేకుండా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే బిడ్డకు జన్మనిచ్చి 22 రోజుల వ్యవధిలో ఉన్నటువంటి మహిళలు మాత్రం అమ్మవారి వ్రతం చేయకూడదని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment