Ashta Sidhi : అష్ట సిద్ధులు అంటే ఏమిటో తెలుసా..? అవి ఎలా ఉంటాయి..?

August 16, 2023 12:55 PM

Ashta Sidhi : యోగా శాస్త్రం ప్రకారం 8 సంఖ్యని మాయకి సంకేతంగా, అలాగే తొమ్మిది సంఖ్యని పరమాత్మకి ప్రతీకగా చెప్తూ ఉంటారు. భగవద్గీతలో అష్ట విధ మాయల ప్రస్తావన ఉంది. పంచభూతాలు మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే, మనసు, బుద్ధి, అహంకారం, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ ఎనిమిదిని జయించిన వారికి కలిగే వాటిని అష్టసిద్ధులు అంటారు.

దత్త చరిత్రలో చూసుకున్నట్లయితే దత్తాత్రేయ మహా గురువులు అష్ట సిద్దులని బిడ్డలుగా ప్రస్తావించారు. ఆయన భక్తులకి అష్టసిద్ధుల‌ అనుగ్రహం ఉంటుందని అభయమిచ్చారు. భగవానుని దివ్య ఆరాధనకి ఫలంగా భక్తులకు ప్రాప్తించే ఎనిమిది సిద్దులు అష్టసిద్ధులు. ఇదివరకు ఋషులు, యోగులు, మహర్షులు అష్టసిద్ధులని పొందార‌ని పురాణాలు చెప్తున్నాయి.

Ashta Sidhi what are they
Ashta Sidhi

ఆంజనేయస్వామి అష్టసిద్ధులు పొందాడు. అందుకే తులసీదాసు చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అని స్తుతించడం జరిగింది. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వం, వశిత్వం ఇవి ఎనిమిది కూడా అష్టసిద్ధులు. మరి ఇక ఎనిమిది గురించి వివరంగా తెలుసుకుందాం. సూక్ష్మావస్థలో కూడా భగవానుడు ఉన్నాడు అని నమ్మి మనసులో నిలుపుట వల్ల ఇది సిద్ధిస్తుంది. దీనివలన అత్యంత సూక్ష్మాణువుగా యోగి తనని మార్చుకోగలడు.

భగవంతుని మహ‌త్తుని దర్శించగలిగిన సాధనకు మహిమ సిద్ధి వస్తుంది. గరిమ విషయానికి వస్తే శరీర బరువుని ఈ భూభారమునకు సమానంగా చేయగలరట. లఘిమ సిద్ధి కలవారు శరీరంని దూది కంటే తేలికగా ఉంచగలరు. ప్రాప్తి ద్వారా కావాలనుకున్న క్షణమునే శూన్యం నుండి కూడా సృజించుకోగలరు. ప్రాకామ్యము అంటే అనేక దివ్య శక్తులు, దూర శ్రవణం, ఆకాశగమనం వంటివి వారిలో ఉంటాయి. ఈశత్వం అంటే ఇంద్రాది దిక్పాలకుల్ని కూడా నియంత్రించగలిగినది. వశిత్వం అంటే సకల జీవ రాశుల వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగే శక్తి. వీటినే అష్ట సిద్ధుల‌ని అంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment