పురిటి నొప్పులతో ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించారు. సరైన సమయంలో వైద్యం అందించలేదు. ఆమె పట్ల ఎంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో ఆ మహిళ ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష అనే మహిళ రెండవసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే ఆమెకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం వెంటనే రాత్రి 8 గంటల సమయంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం అవుతుందని వేచి చూశారు. అయితే అనూషకి పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో తన బాధను చూడలేక కుటుంబసభ్యులు తనకు ఆపరేషన్ చేయాలని వైద్యులను కోరారు. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమయంలో అనూష సిజేరియన్ ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ చేసిన తర్వాత వైద్యులు అనూష పట్ల నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆమెకు అధిక రక్తస్రావం జరిగి.. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది.
ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా ఆమెను ఆంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఏం జరిగిందని ఆరాతీస్తే అసలు విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు సైతం ఆంబులెన్స్ లో కరీంనగర్ ఆస్పత్రికి బయలుదేరగా.. అప్పటికే అనూష మరణించిందని చెప్పడంతో.. బాధిత కుటుంబ సభ్యులు అనూష మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలను కోల్పోయిందంటూ.. ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పేషంట్ ల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించే వైద్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…