దారుణం.. పురుడు పోసి ఆ తల్లి ప్రాణాలు తీశారు.. అనాథగా మారిన చిన్నారి..

September 17, 2021 12:45 PM

పురిటి నొప్పులతో ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించారు. సరైన సమయంలో వైద్యం అందించలేదు. ఆమె పట్ల ఎంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో ఆ మహిళ ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష అనే మహిళ రెండవసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే ఆమెకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం వెంటనే రాత్రి 8 గంటల సమయంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

దారుణం.. పురుడు పోసి ఆ తల్లి ప్రాణాలు తీశారు.. అనాథగా మారిన చిన్నారి..

అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం అవుతుందని వేచి చూశారు. అయితే అనూషకి పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో తన బాధను చూడలేక కుటుంబసభ్యులు తనకు ఆపరేషన్ చేయాలని వైద్యులను కోరారు. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమయంలో అనూష సిజేరియన్ ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ చేసిన తర్వాత వైద్యులు అనూష పట్ల నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆమెకు అధిక రక్తస్రావం జరిగి.. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది.

ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా ఆమెను ఆంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఏం జరిగిందని ఆరాతీస్తే అసలు విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు సైతం ఆంబులెన్స్ లో కరీంనగర్ ఆస్పత్రికి బయలుదేరగా.. అప్పటికే అనూష మరణించిందని చెప్పడంతో.. బాధిత కుటుంబ సభ్యులు అనూష మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలను కోల్పోయిందంటూ.. ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పేషంట్ ల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించే వైద్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment