క్రికెట్

పాకిస్థాన్‌లో మ్యాచ్ ఆడాలంటే భ‌య‌ప‌డుతున్న న్యూజిలాండ్ క్రికెటర్లు.. 18 ఏళ్ల త‌రువాత వ‌చ్చినా.. సెక్యూరిటీ కార‌ణాల‌తో టూర్ మొత్తం ర‌ద్దు..

ఆడ‌క ఆడ‌క పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడుదామ‌ని న్యూజిలాండ్ ప్రిపేర్ అయి వ‌చ్చింది. 18 ఏళ్ల త‌రువాత ఎట్ట‌కేల‌కు పాక్ లో అడుగు పెట్టిన కివీస్ బ్యాట్స్ మెన్ మ్యాచ్‌లు ఆడేందుకు రెడీ అయ్యారు. శుక్ర‌వారం రావ‌ల్పిండిలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మొద‌టి వ‌న్డే మ్యాచ్ ప్రారంభం కావ‌ల్సి ఉంది. కానీ ఎంత సేపు వేచి చూసినా కివీస్ బ్యాట్స్ మెన్ మాత్రం హోట‌ల్‌కే ప‌రిమితం అయ్యారు. స్టేడియంకు రాలేదు.

న్యూజిలాండ్‌కు చెందిన సెక్యూరిటీ నిపుణుల స‌ల‌హా మేర‌కు పాక్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ల‌ను.. టూర్ మొత్తాన్ని ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. దీంతో ప్లేయ‌ర్లు స్టేడియం వ‌ర‌కు రాకుండానే హోట‌ల్ నుంచి అటు నుంచి అటే న్యూజిలాండ్‌కు ప్ర‌యాణం కానున్నారు.

పాకిస్థాన్ తో నెల‌కొన్న అనేక వివాదాల కార‌ణంగా ఇప్ప‌టికే భార‌త్ మ్యాచ్ ల‌ను ఆడ‌డం లేదు. కేవ‌లం ఐసీసీ టోర్నీల్లోనే పాక్‌తో భార‌త్ త‌ల‌ప‌డుతోంది. అయితే కొన్నేళ్ల కింద శ్రీ‌లంక జ‌ట్టు పాక్‌లో ఆడేందుకు వెళ్లింది. కానీ వారు ప్ర‌యాణిస్తున్న బ‌స్సుపై ఉగ్ర‌దాడి జ‌రిగింది. అదృష్ట‌వ‌శాత్తూ అందులో ఎవ‌రి ప్రాణాలు పోలేదు. కానీ అప్ప‌టి నుంచి పాక్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌డం లేదు. ఇత‌ర దేశాలు పాక్‌లో క్రికెట్ ఆడేందుకు భ‌య ప‌డుతున్నాయి.

అయితే ఎట్ట‌కేల‌కు న్యూజిలాండ్ పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు అంగీక‌రించింది. అందులో భాగంగానే మూడు వ‌న్డేలు, 5 టీ20లు రావ‌ల్పిండి, లాహోర్‌ల‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ టూర్‌లో భాగంగా మొద‌టి వ‌న్డే శుక్ర‌వారం ప్రారంభం కావ‌ల్సి ఉంది. కానీ కివీస్ ప్లేయ‌ర్లు హోట‌ల్‌కే పరిమితం అయ్యారు. పాక్ భ‌ద్ర‌తా విభాగం అధికారులు వారికి ఎంత న‌చ్చ‌జెప్పినా వారు హోట‌ల్‌ను వీడ‌లేదు. మ‌రోవైపు న్యూజిలాండ్ నుంచి భ‌ద్ర‌తా విభాగం అధికారులు అల‌ర్ట్ చేయ‌డంతో ఇక కివీస్ ప్లేయ‌ర్లు టూర్ మొత్తం ఆడేదిలేద‌ని, ర‌ద్దు చేసుకుంటున్నామ‌ని చెప్పారు. దీంతో ప్లేయ‌ర్లు స్టేడియంకు రాకుండానే టూర్ మొత్తం ర‌ద్దు అయింది.

నిజానికి పాకిస్థాన్‌లో అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జ‌ర‌గ‌క చాలా ఏళ్లు అవుతోంది. ఈ టూర్‌తో అయినా క్రికెట్‌కు అక్క‌డ పూర్వ వైభ‌వం తెద్దామ‌నుకున్నారు. కానీ సెక్యూరిటీ కార‌ణంగా ర‌ద్దు అయింది. దీంతో ఏం చేయాలో తెలియ‌క పాక్ క్రికెట్ బోర్డు త‌ల‌లు ప‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM