ప‌బ్‌జి గేమ్‌కు బానిసైన వ్య‌క్తి.. కుటుంబ స‌భ్యుల‌ను గేమ్‌లో లాగా కాల్చి చంపాడు..!

April 10, 2021 8:20 PM

ప్ర‌ముఖ మొబైల్ గేమ్ ప‌బ్‌జి వ‌ల్ల ఎంత మంది ఎన్ని ర‌కాలుగా న‌ష్ట‌పోయారో గ‌తంలో అనేక సంఘ‌ట‌న‌ల్లో మ‌నం చూశాం. ఈ గేమ్‌ను ఆడ‌క‌పోవ‌డం వ‌ల్ల కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. కొంద‌రైతే కుటుంబ స‌భ్యుల‌కు చెందిన డ‌బ్బును దొంగిలించి గేమ్‌లో ఐట‌మ్‌ల‌ను కొనేందుకు ఖ‌ర్చు చేశారు. అయితే పాకిస్థాన్‌లో ఆ వ్య‌క్తి మాత్రం ఇంకాస్త ముందుకే వెళ్లాడు. ప‌బ్‌జి గేమ్‌లో ప్లేయ‌ర్లు ఎలాగైతే ఒక‌ర్నొక‌రు కాల్చి చంపుకుంటారో దాన్ని రియ‌ల్ లైఫ్‌కు అనువ‌దించుకుని అలాగే ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌ను గ‌న్‌తో కాల్చి చంపాడు. వివ‌రాల్లోకి వెళితే…

man addicted to pubg killed own family members

పాకిస్థాన్‌లోని లాహోర్ ప్రాంతం న‌వా కోట్ లో నివాసం ఉండే బిలాల్ ప‌బ్‌జి గేమ్‌కు బానిస అయ్యాడు. ఈ క్ర‌మంలోనే కొన్ని రోజుల కింద‌ట త‌న భార్య‌కు కూడా విడాకులు ఇచ్చాడు. అయితే గేమ్‌ను ఆడొద్ద‌ని చెప్పినందుకు ఓ గ‌న్ సంపాదించి ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌ను కాల్చి చంపాడు. త‌న సోద‌రుడు, సోద‌రి, మ‌ర‌ద‌లు, ఇంకొక‌రిని కాల్చాడు. దీంతో ఆ న‌లుగురు అక్కిక‌క్క‌డే చ‌నిపోయారు.

ఇక ఆ వ్య‌క్తి చేసిన దాడిలో త‌న త‌ల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమె హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతోంది. ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఆ వ్య‌క్తి ఇంటి నుంచి కాల్పులు, పెద్ద అరుపులు వినిపించ‌డంతో ఇరుగు పొరుగు వారు వెంట‌నే అక్క‌డ‌కు వెళ్లి ఆ వ్య‌క్తిని పట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. పోలీసులు అత‌న్ని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా పాకిస్థాన్‌లో 2020లో ఈ గేమ్‌ను బ్యాన్ చేశారు. కానీ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో గేమ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తేశారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment