ప్రపంచం ఎంతో ముందుకుపోతున్నప్పటికీ కొందరికి మాత్రం కొన్ని మూఢనమ్మకాలను నమ్ముతూ అక్కడే ఆగిపోయారు. ఈ క్రమంలోనే వారి వింత నమ్మకాల వల్ల అభం శుభం తెలియని చిన్నారులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి పట్ల పాకిస్థాన్ లో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆ చిన్నారి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఏకంగా ఆమె నాలుక పై కాలుతున్న గొడ్డలి వాతలు పెట్టిన ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది.
బులూచ్‌స్థాన్‌లోని ఫాజల్ కచ్ తుమన్ బుజ్‌దార్ గ్రామంలో తెహసీబ్‌ను అనే బాలిక దొంగతనం చేసిందని ఆరోపిస్తూ గొర్రెల కాపరి ఆ చిన్నారిని దారుణంగా హింసించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె దొంగతనం చేయలేదని నిరూపించుకోవడం కోసం ఆమె తలపై నాలుకపై కాలుతున్న గొడ్డలి ఉంచడం వల్ల బాలిక తీవ్రంగా గాయపడిందని బాలికతండ్రి జాన్ ముహమ్మద్
తెలిపారు.
ఈ క్రమంలోనే బాలికను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ఈ విషయం తెలియడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.ఇప్పటికీ ఈ ప్రాంతంలోని గిరిజన తెగల్లో ఈ విధమైనటువంటి ఆచారాలను మూఢనమ్మకాలను పెద్దఎత్తున విశ్వసిస్తారు. తప్పుచేసిన వారు నిర్దోషులుగా తెలియాలంటే నిప్పులపై నడవడం, వాతలు పెట్టడం, నీటిలో ముంచడం వంటివి చేస్తుంటారు. వీటి నుంచి సురక్షితంగా బయట పడితే వారు నిర్దోషులుగా భావిస్తుంటారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…