చిన్నారి నిర్దోషి అని నిరూపించడం కోసం గొడ్డలితో నాలుకపై వాతలు .!

August 7, 2021 4:37 PM

ప్రపంచం ఎంతో ముందుకుపోతున్నప్పటికీ కొందరికి మాత్రం కొన్ని మూఢనమ్మకాలను నమ్ముతూ అక్కడే ఆగిపోయారు. ఈ క్రమంలోనే వారి వింత నమ్మకాల వల్ల అభం శుభం తెలియని చిన్నారులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి పట్ల పాకిస్థాన్ లో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆ చిన్నారి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఏకంగా ఆమె నాలుక పై కాలుతున్న గొడ్డలి వాతలు పెట్టిన ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది.

బులూచ్‌స్థాన్‌లోని ఫాజల్ కచ్‌ తుమన్ బుజ్‌దార్ గ్రామంలో తెహసీబ్‌ను అనే బాలిక దొంగతనం చేసిందని ఆరోపిస్తూ గొర్రెల కాపరి ఆ చిన్నారిని దారుణంగా హింసించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె దొంగతనం చేయలేదని నిరూపించుకోవడం కోసం ఆమె తలపై నాలుకపై కాలుతున్న గొడ్డలి ఉంచడం వల్ల బాలిక తీవ్రంగా గాయపడిందని బాలికతండ్రి జాన్ ముహమ్మద్
తెలిపారు.

ఈ క్రమంలోనే బాలికను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ఈ విషయం తెలియడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.ఇప్పటికీ ఈ ప్రాంతంలోని గిరిజన తెగల్లో ఈ విధమైనటువంటి ఆచారాలను మూఢనమ్మకాలను పెద్దఎత్తున విశ్వసిస్తారు. తప్పుచేసిన వారు నిర్దోషులుగా తెలియాలంటే నిప్పులపై నడవడం, వాతలు పెట్టడం, నీటిలో ముంచడం వంటివి చేస్తుంటారు. వీటి నుంచి సురక్షితంగా బయట పడితే వారు నిర్దోషులుగా భావిస్తుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now