కన్నవారికి, కుటుంబ సభ్యలకు ఏమైనా అయితే వారిని రక్షించుకునేందుకు తోటి కుటుంబ సభ్యులు ఏం చేసేందుకైనా వెనుకాడరు. ఆ బాలుడు కూడా అలాగే తన తోబుట్టువును రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఓ వైపు రోడ్డు పక్కన పక్షి ఆహారం అమ్ముతూనే మరో వైప తన చదువును కొనసాగిస్తున్నాడు.
హైదరాబాద్‌కు చెందిన 10 ఏళ్ల సయ్యద్ అజీజ్ అనే బాలుడి సోదరి సకీనా బేగం (12) క్యాన్సర్ బారిన పడింది. 2 ఏళ్ల కిందట ఆమెకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం సహాయం చేసింది. కానీ ఆమెకు ఆ డబ్బులు చికిత్స కోసం ఖర్చయ్యాయి. దీంతో వారి పరిస్థితి మొదటికి వచ్చింది. ఈ క్రమంలో వారు సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక తన సోదరిని ఎలాగైనా రక్షించుకోవాలనే తాపత్రయంతో అజీజ్ రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు రహదారి పక్కన పక్షి ఆహారం (బర్డ్ ఫుడ్) అమ్ముతున్నాడు. తరువాత అతను 8 గంటలకు మదర్సాకు వెళ్తాడు. అజీజ్ సంపాదించే డబ్బులు ఆమె మందులకు మాత్రమే సరిపోతున్నాయి. టెస్టులు చేయించేందుకు డబ్బులు సరిపోవడం లేదు. దీంతో అజీజ్ తల్లిదండ్రులు తమకు సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…