ఫోన్లకు చార్జింగ్ పెట్టి వాటితో మాట్లాడుతూ ఇప్పటికే అనేక సంఘటనల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. కొందరు అలాంటి సందర్బాల్లో చనిపోయారు కూడా. అయితే తాజాగా ఓ బాలుడు కూడా ఇలాగే చనిపోయాడు. బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఫోన్‌లో మాట్లాడుతుండగా.. అది ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ బాలుడు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలలోకి వెళితే..
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న చౌము అనే ప్రాంతంలోని ఉదయ్‌పురియా అనే గ్రామానికి చెందిన రాకేష్ నగర్ అనే బాలుడు శుక్రవారం బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఫోన్‌లో ఇంకో వ్యక్తితో కాల్‌లో మాట్లాడుతున్నాడు. ఉన్నట్లుండా సడెన్గా ఆ ఇయర్ ఫోన్స్ పేలాయి. దీంతో రాకేష్‌కు తీవ్ర గాయాలు కాగా అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాగా అతను బ్లూటూత్ పేలి గాయాలు అవడంతోపాటు కార్డియాక్ అరెస్టు వల్ల చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. అయితే ఫోన్లకు చార్జింగ్ పెట్టి వాటిలో మాట్లాడుతుండగా అవి పేలి కొందరు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ బ్లూటూత్ పేలి ఒకరు చనిపోవడం దేశంలో బహుశా ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…