సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత ప్రతి ఒక్క భర్త తనకు సంతానం కలగాలని తన భార్యను ఎంతో ఉన్నతంగా చూసుకోవాలని భావిస్తాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. పెళ్లి అయిన తరువాత తన భార్యకు నరకం అంటే ఏమిటో చూపించాడు. దీంతో అతని చిత్ర హింసలను తట్టుకోలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అతన్ని కటకటాల వెనక్కి పంపించారు. వివరాల్లోకి వెళితే..
విజయవాడకు చెందిన జోత్స్న అనే యువతి ఎంబీఏ చదివి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఆ సమయంలోనే సుశాంత్ చౌదరి అనే వ్యక్తి జోత్స్నను ప్రేమించి తన ప్రేమ విషయాన్ని ఆమెకు తెలియజేశాడు. అందుకు జోత్స్న ఒప్పుకోకపోవడంతో అతను చనిపోతానని బెదిరించాడు. దీంతో ఆమె ఆ ప్రేమను అంగీకరించాల్సి వచ్చింది. అయితే ఇద్దరూ ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో వారి పెళ్లి విషయం వారి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు వీరిద్దరికీ ఎంతో అంగరంగ వైభవంగా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. యువతి తల్లిదండ్రులు పెద్దఎత్తున కట్న కానుకలను సమర్పించారు.
ఈ విధంగా పెళ్లి తర్వాత బెంగళూరులో నివాసమున్న ఈ జంట కొన్ని రోజులకు సుశాంత్ చౌదరి గ్రామానికి వచ్చారు. ఎప్పుడైతే జోత్స్న అత్తారింట్లో నివాసం ఉంటుందో అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఎవరో మాంత్రికుడు తన ఇంటి వారసులను బలిస్తే వారికి లంకెబిందెలు దొరుకుతాయని చెప్పడంతో కుటుంబ సభ్యులు మొత్తం ఆమెపై అధిక ఒత్తిడి తెచ్చి పిల్లల్ని కనాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవారు. ఇదే విషయమే తన తల్లిదండ్రులతో చెప్పడం వల్ల తల్లిదండ్రులు మందలించి వీరిద్దరిని బెంగళూరుకు పంపించారు. అక్కడికి వెళ్లినప్పటికీ ఆమెకు ఏమాత్రం బాధలు తప్పలేదు. ఈ క్రమంలోనే సుశాంత్ చౌదరి నువ్వు పిల్లల్ని కనిస్తావా.. లేకపోతే నేను మరొకరితో పిల్లల్ని కనాలా.. అంటూ ఆమెను తరచూ చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో జోత్స్న తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకొని పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…