సినిమా

వ‌కీల్ సాబ్ కోర్టు సీన్‌లో న‌టించిన ఈమె తెలుసా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘ‌న విజ‌యం సాధించింది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ఎంతో హ్యాపీగా ఫీల‌వుతోంది. ఇక ప‌వ‌న్ అభిమానుల ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది. చాలా రోజుల త‌రువాత ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించి ప‌వ‌న్ ఆయ‌న అభిమానుల‌నే కాదు, సినీ ప్రేక్ష‌కులంద‌రినీ మెప్పించారు. ఇక ఈ మూవీలో కోర్టు సీన్‌లో భాగంగా వ‌చ్చిన‌ సూప‌ర్ వుమన్ స‌ర‌ళ పాత్ర ప్రేక్ష‌కులంద‌రినీ ఎంత‌గానో ఎంట‌ర్‌టైన్ చేసింది.

కోర్టు స‌న్నివేశంలో స‌ర‌ళాదేవి అనే ఎస్ఐని లాయ‌ర్‌గా ప‌వ‌న్ విచారిస్తారు. ఆ సీన్‌లో ఆయ‌న డైలాగ్‌లు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. ప‌వ‌న్ అడిగే ప్రశ్న‌ల‌కు ఆమె జ‌వాబులు చెప్ప‌డం, ప‌వ‌న్ మ‌ళ్లీ వాటికి కౌంట‌ర్ ఇవ్వ‌డం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది. ఆ సీన్ల‌లో ప్రేక్ష‌కులు క‌డుపుబ్బా న‌వ్వారు. అయితే స‌ర‌ళాదేవి పాత్ర‌లో న‌టించిన ఆ న‌టి పేరు లిరీష‌. కోర్టు స‌న్నివేశాన్ని చిత్రీకరిస్తున్న‌ప్పుడు ఆమె ప‌వ‌న్ ఎదురుగా ఉండి డైలాగ్‌లు చెప్పిన‌ప్పుడు ఎలా ఫీల్ అయ్యిందో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసింది.

కోర్టు సీన్‌లో ప‌వ‌న్ ఎదురుగా నిల‌బ‌డాలంటేనే త‌న‌కు భ‌యం వేసింద‌ని ఆమె తెలిపింది. ప‌వ‌న్ చెబుతున్న డైలాగ్‌ల‌కు త‌న‌కు ఒకానొక ద‌శ‌లో మాట‌లు రాలేద‌ని, అయితే క‌ట్ చెప్పాక ప‌వ‌న్ త‌న‌కు స‌ర్ది చెప్పార‌ని, ఇబ్బంది పడొద్ద‌ని అన్నార‌ని, న‌టించాల‌ని ప్రోత్స‌హించార‌ని ఆమె తెలిపింది. కోర్టు స‌న్నివేశంలో ఒక ద‌శ‌లో తాను డైలాగ్‌లు మ‌ర్చిపోయాన‌ని, ఆ స‌మ‌యంలో ప‌వ‌న్‌నే చూస్తుంటే ఆయ‌న ఎందుక‌మ్మా అలా గురాయించి చూస్తున్నావ్ అన్నార‌ని తెలిపింది. అయితే ఆయ‌న ఆ డైలాగ్ స్క్రిప్ట్‌లో లేద‌ని, అప్ప‌టిక‌ప్పుడు అనేశార‌ని, కానీ సినిమా చూస్తున్న ప్రేక్ష‌కులు ఆ డైలాగ్‌ను బాగా ఎంజాయ్ చేశార‌ని ఆమె తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM