ఆ మూడు లక్షణాలే నా బలం: సమంత

June 4, 2021 9:13 PM

ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి సమంత ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించి ఏకంగా తెలుగింటి కోడలుగా అడుగుపెట్టింది.అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాల జోరు ఏమాత్రం తగ్గించడం లేదు. ప్రస్తుతం “ది ఫ్యామిలీ మెన్ 2” అనే వెబ్ సిరీస్ లో నటించారు. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సిరీస్ ప్రమోషన్ లో పాల్గొన్న సమంత పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ప్రతి వ్యక్తి జీవితంలో ముందుగా తన ఇష్టాలు ఏంటో తను తెలుసుకోవాలని, ముందు తనని తాను ప్రేమించుకున్నప్పుడే జీవితం ఎంతో అందంగా ఉంటుందని తెలిపారు. ఇక తన విషయానికి వస్తే నవ్వు, కళ్ళు, శరీర బలం ఈ మూడు లక్షణాలే తన బలం అని సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎంతో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని తెలిపారు.

ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయని అసలు విషయం బయట పెట్టారు. అయితే ఈ విధంగా గొడవలు పడినప్పుడు ముందుగా తనే కాంప్రమైస్ అవుతానని సమంత తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శాకుంతలం” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment