శ్రీదేవి డ్రామా కంపెనీలో 60 ఏళ్ల ఆంటీలతో సుధీర్ రచ్చ రచ్చ!

April 28, 2021 8:38 PM

సాధారణంగా బుల్లితెర పై మల్లెమాల సంస్థ నుంచి వచ్చే ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాలకు మంచి ఫాలోయింగ్ వుంటుంది. ఈ సంస్థ నుంచి వచ్చినదే జబర్దస్త్ కామెడీ షో.ఈ షో ఎంత పాపులారిటీని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సంస్థ నుంచి వచ్చిన మరొక షో “శ్రీదేవి డ్రామా కంపెనీ”. ఈ కార్యక్రమంలో ముందుగా సీరియల్ హీరోను హోస్ట్ గా నిర్వహించి మంచి వ్యూస్ సాధించాలనే ఆలోచనను మల్లెమాల సంస్థ చేశారు.అయితే ఈ ఆలోచన రెండు వారాలకే బెడిసికొట్టడంతో ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సుడిగాలి సుధీర్ ను దించారు.

ఒక్కసారి సుడిగాలి సుదీర్ ఎంటర్ అయితే ఆ కార్యక్రమంలో ఎంత సందడి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హోస్ట్ గా సుడిగాలి సుదీర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ కార్యక్రమానికి మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా నెక్స్ట్ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో సుడిగాలి సుదీర్ చేసిన రచ్చ మామూలుగా లేదు.

.”ఎంటర్ టైన్మెంట్ బిగెన్స్”అంటూ 60 ప్లస్ వయసు ఉన్న ఆంటీలతో చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోనిలాహే.. లాహే సాంగ్‌కి అదిరిపోయే స్టెప్‌లు వేసి అదరహో అనిపించారు. ఇది కదా గ్రేస్ అంటే, ఇది కదా డాన్స్ అంటే అంటూ సుధీర్ వారితో పోటీపడి మరీ డాన్స్ చేయడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన మరింత ఎంటర్టైన్ పొందాలనుకుంటే వచ్చేవారం పూర్తి ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతానికి ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now