ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ భీమ్ లుక్.. ఆనందంలో అభిమానులు!

May 20, 2021 4:54 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు (మే 20) తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న “ఆర్ఆర్ఆర్”చిత్రం నుంచి ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎంతో గంభీరమైన లుక్ లో పంచ కట్టుతో చేతిలో బళ్ళెం పట్టుకుని ఎంతో తీక్షణమైన చూపులతో ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుందని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్, పోస్టర్లు ఈ సినిమాలపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.

తాజాగా తారక్ కరోనా బారిన పడటంతో తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన అభిమానులకు కూడా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని తెలిపారు.ఈ క్రమంలోనే తమ అభిమాన నటుడికి సోషల్ మీడియా వేదికగా మాత్రమే పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియ జేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment