సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ కూడా ఒకటి. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు గాను చిత్ర యూనిట్ శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ తేజ, ఆలియా భట్, అజయ్ దేవగన్ వంటి అగ్ర తారలు ఈ మూవీలో నటించారు. సంచలన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల చుట్టూ తిరిగే కల్పిత కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆలియా భట్ పాత్రకు సీత అని పేరు పెట్టారు. OTTనా, థియేటర్లా అని సినీ నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న సమయంలో, పరిశ్రమ కొంత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో, ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఇప్పటికే భారీ మొత్తంలో లాభాలను ఆర్జించింది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు వెర్షన్లలో విడుదల కానున్న ఈ చిత్రం శాటిలైట్, థియేటర్, డిజిటల్ హక్కులను అమ్మడం ద్వారా భారీ మొత్తాన్ని సంపాదించింది. మింట్ నివేదిక ప్రకారం ష్యూర్-షాట్ బ్లాక్ బస్టర్ హక్కులను అమ్మడం ద్వారా ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రూ.350 కోట్లను సంపాదించింది.
ఇండియా టుడే నివేదిక ప్రకారం నిజాం ప్రాంతంలో రూ.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.100 కోట్లు, సీడెడ్ జిల్లాల్లో రూ.40 కోట్లు, కర్ణాటకలో రూ .50 కోట్లు వచ్చాయి. లాభాలను పంచుకోవడంలో దర్శకుడికి 50 శాతం వాటా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీని ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని సంపాదించినట్లు తెలుస్తుంది.
ఇక ఈ చిత్రానికి ఆలియా భట్‌ను ఎంపిక చేయడంపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ అగ్ర నటీనటుల ఎదుట నిలబడి ధైర్యంగా నటించగలిగే సత్తా ఉందని, అందుకే ఆలియాను ఎంపిక చేశామని తెలిపారు. జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ తేజ అగ్ర నటులు. వారి మధ్య నిలబడి నటించాలంటే అందుకు తగిన నటి అవసరం. అందుకనే ఆలియాను ఎంపిక చేశా.. అని రాజమౌళి అన్నారు. అయితే ఈ మూవీని అంతకు ముందు ప్రేమకథ చిత్రం అని భావించారు. కానీ అది కాదని తరువాత తెలిసింది. మరి చిత్రం ఎలా ఉంటుందన్నది తెలియాలంటే విడుదల అయ్యే వరకు వేచి చూడక తప్పదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…