వైరల్: విజయ్ దేవరకొండపై.. ఆర్జీవీ కామెంట్స్..!

July 20, 2021 6:17 PM

టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా, ఏం మాట్లాడినా అది సంచలనం సృష్టిస్తుంది. తనకు ఏది తోచితే అదే మాట్లాడుతూ నిత్యం వార్తల్లో ఉంటారు.తన గురించి ఎవరు ఎన్ని అన్నప్పటికీ ఇతరుల మాటలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంటారు. ఈ క్రమంలోనే రామ్గోపాల్వర్మ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయినది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను తమ గురువు రాంగోపాల్ వర్మ కు చూపించారు. ఈ సన్నివేశాలు చూసిన రామ్ గోపాల్ వర్మ విజయ్ దేవరకొండ గురించి పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

రాంగోపాల్ వర్మ విజయ్ దేవరకొండ స్టైల్ నటన పై కామెంట్స్ చేస్తూనే మధ్యలోకి మహేష్ బాబు, రవితేజ, పవన్ కళ్యాణ్ టైగర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోల కంటే విజయ్ దేవరకొండ సూపర్ క్రాస్ అంటూ పేర్కొన్నారు.అదేవిధంగా గత రెండు దశాబ్దాల కాలం నుంచి ఎలాంటి హీరోను చూడలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ రామ్ గోపాల్ వర్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ విధంగా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now