ఆయన తమ్ముడిగా పుట్టడం అదృష్టం: పవన్ కళ్యాణ్

August 22, 2021 10:26 PM

తెలుగు సినిమా హీరోలలో స్టార్ గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22 పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అభిమానులు, సినిమా సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ తమ్ముడిగా, జనసేన అధినేతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అన్నయ్య చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.. చిరంజీవి నాకే కాదు ఎందరికో మార్గదర్శి.. ఎందరికో స్ఫూర్తి ప్రదాత.. ఎందరికో ఆదర్శ ప్రాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చెప్పలేనన్ని మాటలు వస్తాయి. నేను ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టం అయితే ఆయనలో ఉన్న సుగుణాలు చూస్తూ పెరగడం మరొక అదృష్టమని.. మెగాస్టార్ చిరంజీవి గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అన్నయ్యను ఆరాధించే లక్షలాది మంది అభిమానులలో తాను తొలి అభిమానినని, సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాలలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అన్నయ్య తత్వమని అందుకే ప్రతి ఒక్కరూ తనని సొంత మనిషిగా భావిస్తాంటూ తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ముందుంటారని, ఒకప్పుడు రక్తదాన శిబిరాలను, ఇప్పుడు ఆక్సిజన్ శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణాలు నిలబెడుతున్నారన్నారు. కరోనా సమయంలో ఆకలితో అర్థ నాదాలు చేస్తున్న ఎంతో మంది కార్మికులకు ఆయన కడుపు నింపారని, చిరంజీవిలో దాగి ఉన్న సేవా గుణాన్ని బయటపెడుతూ, చిరంజీవి ఆయురారోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానంటూ పవర్ స్టార్ ఎమోషనల్ అవుతూ చిరంజీవికి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now