ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా డెవలప్ కావడంతో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి చిన్న తప్పును వేలెత్తి చూపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఎన్నో సమస్యలకు పరిష్కారమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా నటి నివేదా పేతురాజ్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది.
తాజాగా నటి ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ చేసినప్పుడు ఇంటికి రాగానే దాన్ని తెరిచి చూడగానే ఆమె ఎంతో షాక్ అయింది. తను ఆర్డర్ చేసుకున్న ఫుడ్డులో బొద్దింక కనిపించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా హోటల్ బండారాన్ని బయట పెట్టేసింది. అదేవిధంగా ఇలాంటి ఫుడ్ డెలివరి చేసిన స్విగ్గి సంస్థను కూడా ఏకిపారేసింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చెప్పడంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
ఈ క్రమంలోనే ఈమె చేసిన పోస్టులు చూసిన పలువురు నెటిజన్లు ఇలాంటి సందర్భాలు ఇంతకు మునుపు తమకు ఎదురయ్యాయి అంటూ స్పందించారు. ఈ క్రమంలోనే ఈ వీడియో ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టిలోకి పడటంతో వెంటనే రంగంలోకి దిగి హోటల్ పై దాడి చేయగా అధికారులు ఖంగుతిన్న విషయాలు బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడిలో భాగంగా హోటల్లో అధిక మొత్తం కుళ్ళిన మాంసం ఉన్నట్లు తెలియజేయడంతో హోటల్ పై చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా నివేదా చేసిన పోస్ట్ హోటల్ బాగోతాన్ని బయట పెట్టింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…