వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వస్తుంది.. కానీ?

April 8, 2021 1:03 PM

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య అధికమవుతున్నాయి. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరగడంతో కొంత వరకు ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కొందరిలో పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ప్రముఖ నటి నగ్మా ఏప్రిల్ 2న ముంబైలో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నప్పటికీ ఆమె కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కూడా కరోనా బారినపడ్డట్టు మనకు తెలిసినదే. అయితే అల్లు అరవింద్ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డారు.

వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం వల్ల వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండి, ఈ వ్యాధి నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా తొందరగా విముక్తి పొందుతారని చెప్పవచ్చు.ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకుండా ఈ మహమ్మారి బారిన పడితే వ్యాధి మరింత తీవ్రతరం అవుతుందని, కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చనీ నిపుణులు తెలియజేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment