జబర్దస్త్ రీ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు!

April 15, 2021 10:56 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మెగా బ్రదర్ నాగబాబు పలు సినిమాలలో నటించి తనదైన ముద్ర వేయించుకున్నారు. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా నిర్మాతగా వ్యవహరించారు. అదేవిధంగా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించడమే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.

జబర్దస్త్ షోలో దాదాపు రెండు సంవత్సరాలపాటు జడ్జీ గా వ్యవహరించిన నాగబాబు ఉన్నఫలంగా జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. జబర్దస్త్ నుంచి బయటకు రాగానే “అదిరింది” షోను ప్రారంభించారు. అయితే జబర్దస్త్ షో కి నాగబాబు రీ ఎంట్రీ ఇస్తారని గత కొంత కాలం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల పై తాజాగా నాగబాబు స్పందించారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నాగబాబు సరదాగా తన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ జబర్దస్త్ ఎందుకు మానేసారు సార్ అని అడగగా అందుకు నాగబాబు స్పందిస్తూ..”మల్లెమాల వాళ్లతో సైద్ధాంతిక తేడాలు రావడం వల్లే” అని వెల్లడించారు. ఈ క్రమంలోనే మరొక నెటిజన్ ఒకవేళ జబర్దస్త్ నిర్వాహకులు మీ దగ్గరకు వచ్చి షో కి రమ్మని అడిగితే వస్తారా? అని అడగగా అందుకు నాగబాబు పింక్ చిత్రం పోస్టర్
షేర్ చేశారు. “నేను ఎప్పుడైతే నో అని చెప్పానో..అది చేయను” అని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే నాగబాబు జబర్దస్త్ రీ ఎంట్రీ పై వస్తున్న వార్తలకు పులిస్టాప్ పెట్టారని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment