మరో సూపర్ హిట్ రీమేక్ కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ?

August 18, 2021 6:43 PM

మెగాస్టార్ చిరంజీవి తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత మలయాళ సూపర్ హిట్ చిత్రం అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. అదేవిధంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం అనే సినిమాని కూడా తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా మెగాస్టార్ మరో సూపర్ హిట్ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

ప్రస్తుతం మోహన్ లాల్ నటించిన “లూసిఫర్” చిత్రాన్ని చిరు తెలుగులో రీమేక్ చేయనున్నారు. అదే విధంగా అజిత్ హీరోగా నటించినటువంటి “వేదాళం” చిత్రాన్ని కూడా చిరు రీమేక్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ రెండు చిత్రాల తర్వాత మెగాస్టార్ మరో రీమేక్ సినిమాలో నటించబోతున్నారు. అజిత్ నటించిన టువంటి  ‘ఎన్నై అరిందాల్’ ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే  ‘ఎన్నై అరిందాల్’ సినిమా తెలుగులో “ఎంత వాడు కానీ” అనే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అయితే ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవికి అనుగుణంగా స్క్రిప్ట్ లో మార్పులు చేసి మరోసారి చిరు హీరోగా ఈ సినిమాను తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారాన్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now