కృష్ణాష్టమి సందర్భంగా రాధేశ్యామ్ సరికొత్త అప్‌డేట్‌.. మీరు చూశారా ?

August 30, 2021 2:50 PM

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాధేశ్యామ్”. పీరియాడికల్ జానర్‌లో రొమాంటిక్ ఎంటెర్‌టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం ప్రకటించింది.

కృష్ణాష్టమి సందర్భంగా రాధేశ్యామ్ సరికొత్త అప్‌డేట్‌.. మీరు చూశారా ?

కృష్ణాష్టమి సందర్భంగా చిత్ర బృందం సినిమా నుంచి సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే ప్రేరణగా సందడి చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాను రాధాకృష్ణ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా చిత్ర బృందం వెల్లడించింది. ఇకపోతే ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్”, ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now