Shraddha Srinath: మలయాళ కోహినూరు వజ్రం శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళంలో తెరకెక్కిన “కోహినూరు”సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన నటి శ్రద్ధా శ్రీనాథ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించి పెట్టింది. ఈ క్రమంలోనే ఈమె తెలుగు మలయాళంలో కూడా నటించి ప్రేక్షకులను అలరింప చేశారు.తెలుగులో నాని సరసన నటించిన జెర్సీ సినిమా ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్ ప్రస్తుతం “కలియుగం” అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అసలు తన జీవితంలో నటిగా మారాలని తాను ఎప్పుడూ భావించలేదని రోజుకు ఒక ఆలోచన చేస్తూ తన కెరియర్ లో ఒక్కో స్థాయిలో ఉండాలని ఆలోచించేదాన్ని తెలిపారు. ఒకరోజు లాయర్ కావాలనుకుంటే మరొక రోజు ఆస్ట్రోనాట్, న్యూస్ రీడర్, సైకోథెరపిస్ట్ ఇలా రోజుకో కెరీర్‌లో సెటిల్ కావాలనే ఆలోచన కలిగేదని తెలిపారు.
తన జీవితంలో ఎలా సెటిల్ కావాలని ఎన్ని విధాలుగా ఆలోచించిన చివరికి నటనపై దృష్టి సారించి నిలబడ్డానని అసలు విషయం బయట పెట్టారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి తెలియజేశారు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే కొందరు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ పాటు ఇండస్ట్రీలో కొనసాగలేదు అన్న వారు కోకొల్లలుగా ఉన్నారు అయితే ఆ మాటలను పట్టించుకోకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని వారికి సరైన సమాధానం చెప్పాలని భావించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…