Shraddha Srinath: జీవితంలో ఏదో కావాలని చివరికి నటినయ్యా.. నటి శ్రద్ధా శ్రీనాథ్!

July 30, 2021 1:42 PM

Shraddha Srinath: మలయాళ కోహినూరు వజ్రం శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళంలో తెరకెక్కిన “కోహినూరు”సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన నటి శ్రద్ధా శ్రీనాథ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించి పెట్టింది. ఈ క్రమంలోనే ఈమె తెలుగు మలయాళంలో కూడా నటించి ప్రేక్షకులను అలరింప చేశారు.తెలుగులో నాని సరసన నటించిన జెర్సీ సినిమా ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్ ప్రస్తుతం “కలియుగం” అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అసలు తన జీవితంలో నటిగా మారాలని తాను ఎప్పుడూ భావించలేదని రోజుకు ఒక ఆలోచన చేస్తూ తన కెరియర్ లో ఒక్కో స్థాయిలో ఉండాలని ఆలోచించేదాన్ని తెలిపారు. ఒకరోజు లాయర్ కావాలనుకుంటే మరొక రోజు ఆస్ట్రోనాట్‌, న్యూస్‌ రీడర్‌, సైకోథెరపిస్ట్‌ ఇలా రోజుకో కెరీర్‌లో సెటిల్ కావాలనే ఆలోచన కలిగేదని తెలిపారు.

తన జీవితంలో ఎలా సెటిల్ కావాలని ఎన్ని విధాలుగా ఆలోచించిన చివరికి నటనపై దృష్టి సారించి నిలబడ్డానని అసలు విషయం బయట పెట్టారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి తెలియజేశారు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే కొందరు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ పాటు ఇండస్ట్రీలో కొనసాగలేదు అన్న వారు కోకొల్లలుగా ఉన్నారు అయితే ఆ మాటలను పట్టించుకోకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని వారికి సరైన సమాధానం చెప్పాలని భావించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now