అక్కినేని సమంతకు చెందిన విడాకుల వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయంపై ఎన్నిసార్లు ప్రశ్నించినా సమంత మాటలు దాట వేసింది. కానీ స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. ఇక తన సోషల్ ఖాతాలో అక్కినేని అనే ఇంటి పేరును వదిలేసి కేవలం S అనే అక్షరాన్ని మాత్రమే ఉంచింది. దీంతో ఏదో జరుగుతుందని అభిమానులకు అనుమానం వచ్చింది. విడాకులపై అడుగుతున్న ప్రశ్నలకు సమంత సైతం సమాధానాలు చెప్పకపోతుండడంతో ఆ అనుమానం బలపడింది. దీంతో నాగచైతన్య, సమంతల విడాకులు ఖాయమని సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తోంది.
ఇక తాజాగా వీరిద్దరి విడాకులకు చెందిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత, అబద్ధమెంత ? అన్నవిషయం తెలియదు కానీ.. నాగచైతన్య, సమంతల మధ్య విడాకులు ఫిక్స్ అయ్యాయని, ఈ క్రమంలోనే సెటిల్‌మెంట్ కింద సమంతకు చైతన్య రూ.50 కోట్ల ఆస్తులను ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
2017 అక్టోబర్‌లో వీరిద్దరి వివాహం జరగ్గా.. ఎంతో అన్యోన్యంగా వీరు నిన్న మొన్నటి వరకు జీవించారు. కానీ ఇటీవలి కాలంలో కొన్ని పోస్టుల్లో సమంత ఒంటరిగానే కనిపిస్తోంది. ఎప్పుడో ఒకసారి చైతన్య తోడుగా కనిపిస్తున్నాడు. ఇక సోషల్ ఖాతాలో అక్కినేని పేరును తొలగించి కేవలం S అనే అక్షరాన్ని సమంత ఉంచడంతో ఒక్కసారిగా ఈ దంపతులకు చెందిన విడాకుల వార్త తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే మరో 2, 3 నెలల్లో విడాకుల ప్రక్రియ పూర్తి కానున్నట్లు కూడా తెలుస్తోంది. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…